Oct 28,2023 21:21

రేగిడి: మాట్లాడుతున్న ఎమ్మెల్సీ విక్రాంత్‌

ప్రజాశక్తి- రేగిడి : జగనన్న ఆరోగ్య సురక్షతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ అన్నారు. శనివారం తునివాడ గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. జగనన్న సురక్షతో ప్రజల ఆరోగ్యానికి రక్షణగా ఉంటుం దన్నారు. అనంతరం 576 మందికి వైద్య పరీక్షలు నిర్వహిం చారు. వీరిలో అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దార అప్పలనరసమ్మ, వైస్‌ ఎంపిపిలు టంకాల అచ్చెంనాయుడు, వావిలపల్లి జగన్మోహన్‌ రావు, వైద్యాధికారి అసిరి నాయుడు, కరణం గోవిందరావు, కరణం శ్రీనివాసరావు, నెల్లి పెంటంనాయుడు, కెల్ల మన్మధరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
శృంగవరపుకోట: పేదల ఆరోగ్య పరిరక్షణకై జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు. మండలంలోని మూలబొడ్డవర గ్రామ సచివాలయ పరిధి మూలబొడ్డవర గ్రామంలో శనివారం ప్రారంభమైన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేదల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేసిన పథకమే జగనన్న సురక్ష అని అన్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సండి సోమేశ్వరరావు, జెడ్‌పిటిసి ఎమ్‌.వెంకటలక్ష్మి, వైస్‌ ఎంపిపి ఇందుకూరి సుధారాజు, ఎస్‌.కోట మేజర్‌ పంచాయితీ సర్పంచ్‌ జి.సంతోషికుమారి, స్థానిక సర్పంచ్‌ దేవపురపు మీనా, ఎంపిటిసి లక్ష్మి, వైస్‌ సర్పంచ్‌ అప్పారావు, పెదఖండేపల్లి సర్పంచ్‌ యాళ్ళ రమణ, ఎంపిటిసి బోదల దేముడు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పూసపాటిరేగ: అందరికి ఆరోగ్యం ప్రభుత్వ లక్ష్యమని ఎంపిడిఒ కె. రాధిక అన్నారు. శనివారం మండలంలోని చింతపల్లి సచివాలయం-2 పరిధిలో జగనన్న సురక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 356 మందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు చేసి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైయస్సార్‌ కంటి వెలుగు పథకంలో భాగంగా కంటి పరీక్షలు చేసి వారికి ఉచితంగా కళాద్దాల పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల జేసిఎస్‌ కన్వీనర్‌ మహంతి శ్రీనివాసరావు, మత్స్యకార సంఘం అధ్యక్షలు బర్రి చిన్నప్పన్న, సర్పంచ్‌ బర్రి ముసలి, తహశీల్దార్‌ బాస్కరావు, ఇఒపిఆర్‌డి శ్రీనివాసరావు, నాయకులు దాసు, అప్పడు దొర, డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడి టీచర్లు, సచివాలయం సిబ్బంది, పాల్గొన్నారు.
కొత్తవలస: స్థానిక పిహెచ్‌సి పరిధిలోని డాబాలు కొత్తవలస-4 సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్యశిభిరంలో శనివారం 440 మందికి తనిఖీలు చేసినట్లు వైద్యాధికారి డాక్టర్‌ డి.సీతల్‌ వర్మ తెలిపారు. సర్పంచ్‌ మచ్చ ఎర్రయ్య రామస్వామి ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష మెగా వైద్య శిభిరం ఏర్పాటు చేసినట్లు పంచాయతీ సెక్రటరీ ఇ. కన్నబాబు తెలిపారు. ఎంపిపి నీలం శెట్టి గోపమ్మ మాట్లాడుతూ జగనన్న సురక్షను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.