Oct 25,2023 20:20

నెల్లిమర్ల: మందులను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు

ప్రజాశక్తి- నెల్లిమర్ల : జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రజల వద్దకే ఉచిత వైద్య సేవలందిస్తున్నామని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పి.సురేష్‌బాబు అన్నారు. బుధవారం తంగుడుబిల్లిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వైద్య శిబిరాన్ని వారు సందర్శించారు. ప్రజల ఆరోగ్య పరిస్థితిలను, వారికి చేస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రవేశపెట్టిందన్నారు. వైద్యులు మీ దగ్గరకి వచ్చి ఆరోగ్య తనిఖీలు చేసి చికిత్స, మందులు అందిస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అంబళ్ల సుధారాణి, జడ్‌పిటిసి గదల సన్యాసి నాయుడు, రాష్ట్ర టూరిజం డైరెక్టర్‌ రేగాన శ్రీనివాస రావు, ఎంపిడిఒ గిడుతూరి రామారావు, సతివాడ పిహెచ్‌సి వైద్యాధికారి బి.సాయి నందిని తదితరులు పాల్గొన్నారు.
తెర్లాం: జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని తహశీల్దార్‌ రతన్‌ కుమార్‌ అన్నారు. మండలంలోని లోచర్ల సచివాలయ పరిధిలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమకు అవసరమైన పరీక్షలు చేయించుకొని మందులు ఉచితంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొత్తవలస: పేద ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ప్రజలకు శ్రీరామరక్ష అని కొత్తవలస మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ మచ్చ ఎర్రయ్య రామస్వామి అన్నారు. కొత్తవలసలో బుధవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని, అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేస్తూ రాష్ట్ర ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ శ్రీనివాస్‌ మిశ్రా, ఎంఇఒ బండారు శ్రీనివాసరావు, పంచాయతీ ఇఒ సిహెచ్‌ కన్నబాబు, పిఎసిఎస్‌ అధ్యక్షులు గొరపల్లి శివ, మేలాస్త్రి అప్పారావు, గొరపల్లి రవి, డాక్టర్‌ సీతామహాలక్ష్మి, అంగన్వాడి సూపర్‌వైజర్‌ రవణమ్మ, వైద్యాధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
శృంగవరపుకోట: రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా చూడాలన్నదే జగనన్న లక్ష్యమని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని ఎస్‌.కోట తలారి సచివాలయం పరిధిలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజులు వేరువేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా వారు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపునకు వచ్చిన రోగులను స్వయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ వారికి వైద్యులు ఇచ్చే వైద్యాన్ని తెలుసుకొని పేదల ఆరోగ్యమే జగనన్న దేయమని రోగులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి పెనిశెట్టి వెంకటరమణ, స్టేట్‌ డైరెక్టర్‌ వాకాడ రాంబాబు, స్థానిక సర్పంచ్‌ రంధి అరుంధతి, అనంత్‌, జెసిఎస్‌ మండల ఇంచార్జి వాకాడ సతీష్‌, ఆవాల కృష్ణ, పోతనపల్లి కూనిరెడ్డి వెంకటరావు, ధర్మవరం అల్లు మహాలక్ష్మి నాయుడు, గట్టి రెడ్డి పైడితల్లి, అవతారం, ఎస్‌కోట తలారి రమణ, వీరనారాయణం సోంబాబు, సోషల్‌ మీడియా కో కన్వీనర్‌ జయశంకర్‌, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.