Oct 03,2023 23:06

ప్రజాశక్తి-యంత్రాంగం ప్రజలకు దగ్గరగా ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్య సురక్ష శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పలువురు పిలుపు ఇచ్చారు. మంగళవారం పలుచోట్ల జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ కొండయ్యపాలెంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై అక్కడి పిహెచ్‌సిని కమిషనర్‌ నాగనరసింహారావు మంగళవారం సందర్శించారు. ఆరోగ్య సురక్ష శిబిరాల నిర్వహణకు సంబంధించి అందించాల్సిన సేవలు, పిహెచ్‌సికి వచ్చే రోగులకు కల్పించాల్సిన సదుపాయాలపై ఆయన ఆరోగ్య సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ కాకినాడ కార్పొరేషన్‌ పరిధిలో బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఆరోగ్య సురక్ష శిబిరాలను వివిధ ప్రాంతాల్లోని 13 యుపిహెచ్‌సిలలో వేర్వేరు తేదీలలో నిర్వహిస్తామన్నారు. కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా, ఎంపీ వంగా గీత, ఎంఎల్‌సి కర్రి పద్మశ్రీ, ఎంఎల్‌సి ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితోపాటు పలువురు అధికారులు, ప్రజాతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ వెంట నగరపాలక సంస్థ కార్యదర్శి ఏసుబాబు, ఎంహెచ్‌ఒ డాక్టర్‌ పృథ్వీచరణ్‌, జిల్లా ప్రోగ్రాం అధికారి పావని, ఇఇ మాధవి, ఎఇ రమేష్‌, మెడికల్‌ ఆఫీసర్‌ ఉదయశ్రీ, శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ సత్తెప్పనాయుడు తదితరులు పాల్గొన్నారు. కరప జెడ్‌పిటిసి వై.సుబ్బారావు, ఎంపిపి శ్రీలక్ష్మి వేళంగిలోని మెర్లాస్‌ జెడ్‌పి పాఠశాలలో సర్పంచ్‌ సవిలే నీలిమా రాజేష్‌ అధ్యక్షతన ఎంపిపి పెంకే శ్రీలక్ష్మి సత్తిబాబు, జెడ్‌పిటిసి యాళ్ల సుబ్బారావు, కొప్పిశెట్టి మంగయ్యమ్మ, కుంచే అయ్యన్న, డాక్టర సౌజన్య, డాక్టర్‌ నాయక్‌, పంచాయతీ సెక్రటరీ పబ్బినీడి శ్రీనివాస్‌, డాక్టర్‌ బొండా వెంకన్నారావు పాల్గొన్నారు. సామర్లకోట రూరల్‌ మాధవపట్నం గ్రామ సచివాలయం పరిధిలో సుమారు 410 మంది ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. శిబిరాన్ని ఎంపిపి బొబ్బరాడ సత్తిబాబు, ఎంపిడిఒ డి.శ్రీలలిత ప్రారంభించారు. డాక్టర్‌ పి.ప్రశాంత్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మేడిశెట్టి వీరభద్రం, గ్రామ సర్పంచ్‌ మేడిశెట్టి సుగుణమ్మ, హరికృష్ణ సత్యారెడ్డి పాల్గొన్నారు. రౌతులపూడి ప్రత్తిపాడు ఎంఎల్‌ఎ పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్‌ అన్నారు. మండల కేంద్రమైన రౌతులపూడి ఒకటో సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 303 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు ఎంపిడిఒ గోవింద్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఎం.రఘు వంశీ, ఆర్‌.హేమబిందు, జి.సౌందర్య రాజాజీ సేవలందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్పర్సన్‌ రమణమ్మ, వైసిపి మండల అధ్యక్షుడు శ్రీను, మండల పరిషత్‌ ఉపాధ్యాయుడు మంగ లక్ష్మి భాస్కర్‌ బాబు, డిసిసిబి డైరెక్టర్‌ మధు సర్పంచ్‌ అర్జమ్మ పంచాయతీ కార్యదర్శి వెంకటరావు పాల్గొన్నారు. గండేపల్లి మల్లేపల్లి సచివాలయం 1 వద్ద శిబిరాన్ని ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు ప్రారంభించారు. అనంతరం మాతా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్‌ను ఎంఎల్‌ఎ సందర్శించి అక్కడ ఉన్న గర్భిణు స్త్రీలకు నవజాత శిశువులకు అందించే పౌష్టికాహారాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చలగళ్ల దొరబాబు, వైస్‌ ఎంపిపి బిట్రా వెంకటలక్ష్మి రమణ, సర్పంచ్‌ బలిరెడ్డి వరలక్ష్మి గంగరాజు, ఉప సర్పంచ్‌ దొమ్మ శ్రీను, సొసైటీ అధ్యక్షులు బిట్రా గిరిబాబు, కందుల చిట్టిబాబు, జాస్తి వసంత్‌, ఒబిన్ని వీరబాబు, పోసిన బాబూరావు, వైద్యాధికారిణి సౌమ్య, కార్యదర్శి కట్టా చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. పెద్దాపురం రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు రాజు గారి వీధిలోని ఆర్యవైశ్య సేవా కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ప్రారంభించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డు తులసీ మంగ తాయారు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సభలో డాక్టర్‌ సరిత, వైస్‌ చైర్మన్లు నెక్కంటి సాయి ప్రసాద్‌, కనకాల మహాలక్ష్మి, మున్సిపల్‌ కమిషనర్‌ జె.సురేంద్ర, కంటే వీరరాఘవరావు, ఆవాల లక్ష్మీనారాయణ, ఆగ్రో డైరెక్టర్‌ సయ్యద్‌ జానీ, ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ ఎన్‌.సుదీప్తి పాల్గొన్నారు. జగ్గంపేట రూరల్‌ మల్లిశాలలో ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట, కిర్లంపూడి ఎంపిపిలు అత్తులూరి నాగబాబు, తోట రవి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జనపరెడ్డి బాబు, ఉయ్యూరి నాని, కరుటూరి వీర్రాజు పాల్గొన్నారు. తాళ్లరేవు చొల్లంగి పంచాయతీలో మంగళవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ ఆరోగ్య శిబిరాన్ని స్థానిక సర్పంచ్‌ బూరెల సూర్య ప్రభావతి ప్రారంభించారు. వైద్యులు ఎన్‌.శ్యామల, ఎల్‌.సురేష్‌ కుమార్‌, ఆర్‌.మాధురి, శ్రావణి రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. బూరెల వెంకట రాజు, శివాజీ గణేషన్‌, స్వర్ణ రాజు, మాస శ్రీనివాస్‌, వార సూర్యకుమారి, కేబుల్‌ శ్రీనివాస్‌, నూకరాజు పాల్గొన్నారు.