
ప్రజాశక్తి-కొత్తవలస : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో ప్రజారోగ్యానికి భరోసా లభిస్తుందని ఎమెమ్లఏ్య కడుబండి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం మండలంలోని మంగళపాలెం సచివాలయ పరిధిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. రోగులను స్వయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయన స్వయంగా రక్తపరీక్షలు చేయించుకొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయం చేసినా సరే ఆరోగ్యం విషయంలోనూ అండగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పలవెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ , పిఎసిఎస్ అధ్యక్షుడు గొరపల్లి శివ, సర్పంచ్ అయితంశెట్టి దుర్గ, ఎంపిటిసి అయితంశెట్టి నాగమణి, వైసిపి యువజన విభాగం మండల అధ్యక్షులు అయితంశెట్టి అనీల్, నాయకులు అమ్మా శ్రీను, జామి సాల్మన్ రాజు, గణేష్, చింతలపాలెం మాజీ సర్పంచ్ భీష్మ పాల్గొన్నారు.
శృంగవరపుకోట : ప్రజారోగ్యానికి భరోసా జగనన్న ఆరోగ్య సురక్షని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని కొత్తూరు సచివాలయ పరిధిలో నిర్వహించిన ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి పి.వెంకటరమణ, స్టేట్ డైరెక్టర్ వాకాడ రాంబాబు, సర్పంచులు చిట్టిపోలు లక్ష్మి, మంచిన కోటి, ఉల్లి శంకర్, చిట్టిపోలు సాయి, కొట్టం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
వేపాడ : మండలంలో వావిలిపాడు సచివాలయం వద్ద సర్పంచ్ బీల రాజేశ్వరి ఆధ్వర్యాన నిర్వహించిన జగనన్న సురక్ష ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించినది. ఈ శిబిరాన్ని ఎంపిపి డి.సత్యవంతుడు సందర్శించారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ చిన రామునాయుడు, జెడ్‌పిటిసి అప్పలనాయుడు, వ్యవసాయ సలహా మండలి మండల చైర్మన్ నాయుడు, వైసిపి నాయకులు జగన్నాథం, బి.సతీష్, జెఎసి కన్వీనర్ శ్రీను, ఎంపిడిఒ పట్నాయక్, ఐసిడిఎస్ సూపర్వైజర్ పి.భాగ్యవతి, పిసిసి కన్నంనాయుడు పాల్గొన్నారు.
డెంకాడ : పేదలందరికీ కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందించాలని ధ్యేయంతో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలోని బంటుపల్లి సచివాలయ పరిధిలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడు ఆరోగ్యానికి రక్షణగా జగనన్న ఆరోగ్య సురక్ష నిలుస్తుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష లో వైద్య సేవలు అందించిన వైద్య, సచివాలయ, అంగన్వాడి సిబ్బందిని ఘనంగా సన్మానించారు. అనంతరం రోగులకు మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి బంటుపల్లి వెంకట వాసుదేవరావు, వైస్ ఎంపిపిలు పిన్నింటి తమ్మునాయుడు, కోరాకుల అనిత, తహశీల్దార్ టి.ఆదిలక్ష్మి, సర్పంచ్ చిక్కాల హేమలత, నాయకులు చిక్కాల జనార్దన్ రావు, గోపి తదితరులు పాల్గొన్నారు.
బొబ్బిలి : జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రజల వద్దకు వైద్య సేవలు అందుతున్నాయని మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ అన్నారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు మున్సిపల్ పాఠశాలలో గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైద్యులు, వైసిపి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
విజయనగరం టౌన్ : జమ్ము పాఠశాలలో ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని కమిషనర్ ఆర్.శ్రీరాములునాయుడు సందర్శించారు. కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.