Oct 21,2023 21:10

ప్రజాశక్తి - కాళ్ల
          పేదలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేందుకు జగన్నన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎంతో దోహదపడుతుందని జెడ్‌పిటిసి సభ్యులు పచ్చిగోళ్ల సోమేశ్వరరావు అన్నారు. మండలంలోని బొండాడపేటలో సర్పంచి వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. వైద్యులు ఎం.గులాబ్‌రాజ్‌కుమార్‌, వైద్య సిబ్బంది, ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. పంచాయతీ కార్యదర్శి చెన్ను సుజాత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు గుత్తికొండ సత్యనారాయణ, కోపల్లె సొసైటీ అధ్యక్షులు వేగేశ్న జయరామకృష్ణంరాజు, వైసిపి మండల కన్వీనర్‌ గణేశ్న రాంబాబు, పి.రంగరాజు పాల్గొన్నారు.
గణపవరం :జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వైద్య శిబిరాలను పేదలు వినియోగించుకోవాలని ఎంపిడిఒ జి.జ్యోతిర్మయి అన్నారు. పిప్పర సచివాలయం వద్ద శనివారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచి కాకర బేబి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఎంపిడిఒ మాట్లాడారు. శిబిరంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఏర్పాటుచేసిన పోషకాహార స్టాల్స్‌ ఆకిర్షించాయి. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ పి.లక్ష్మి, మండల ప్రత్యేకాధికారి కె.శ్రీనివాస్‌, ఇఒపిఆర్‌డి పివి.సత్యనారాయణ, ఎంపిడిఒ పి.శేషు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
ఆచంట : మండలంలోని భీమలాపురం గ్రామంలో సర్పంచి గుబ్బల మాధవరావు అధ్యక్షతన నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంపిపి దిగమర్తి సూర్యకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎఎంసి ఛైర్మన్‌ చిల్లే లావణ్య, ఎంపిపి సూర్యకుమారి మాట్లాడారు. ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పౌష్టికాహారం స్టాల్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ నరసింహప్రసాద్‌, వైద్యాధికారులు రామాంజనేయులు, వర్మ, హైందవి, సత్యవతి, ఆరోగ్యశ్రీ టీం లీడర్‌ రాంబాబు, ఆరోగ్య మిత్ర కనకదుర్గ పాల్గొన్నారు.
వీరవాసరం : ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాల వద్ద ఐసిడిఎస్‌ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంగన్‌వాడీ పోషకాహారంపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ పట్ల భీమవరం ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. వీరవాసరం ఎంఆర్‌కె జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ వద్ద ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. అంగన్‌వాడీ పోషకాహార స్టాల్‌ పరిశీలించారు. వీరవాసరం చినదళితపేటకు చెందిన శ్మశానానికి వెళ్లేందుకు గోగులమ్మ ఆలయం వద్ద ఉన్న రహదారిని అభివృద్ధి చేయాలని ఎంఎల్‌ఎ దృష్టికి నేత జ్ఞానసుందరరాజు తీసుకెళ్లారు. బొంతువారిపేటలోని సీసీ రహదారి నిర్మాణం అవసరమై బొంతు రమేష్‌ ఎంఎల్‌ఎ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించి ఇఒపిఆర్‌డి టి.విజయసారధిని ఆదేశించారు.
నరసాపురం టౌన్‌ : మండలంలోని వేములదీవి పడమర పంచాయతీ కాపుల కొడప తుపాన్‌ షెల్టర్‌ వద్ద నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తొలుత వేములదీవి పడమర గ్రామంలో సరుగుడు తిప్ప రూ.35 లక్షలు జెడ్‌పి నిధులతో నిర్మించిన పుంత రోడ్డును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు బొక్క రాధాకృష్ణ, వైస్‌ ఎంపిపి ఉంగరాల రమేష్‌ నాయుడు, జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షులు అండ్రాజు చల్లారావు, ఎంపిటిసి సభ్యులు వీర్రాజు, సర్పంచి ఒడిగి ఏసుబాబు పాల్గొన్నారు.
భీమవరం రూరల్‌ : పట్టణంలోని ఆరో వార్డులో నిర్వహించిన ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ప్రభుత్వ విప్‌, ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ ప్రారంభించి మాట్లాడారు. సిఎం జగన్‌ ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారన్నారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు వినియో గించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్‌ కోటిపల్లి బాబు, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.శ్యామల, పట్టణ అధ్యక్షులు తోట భోగయ్య, గాదిరాజు రామరాజు, చింతల పాటి నరసింహరాజు, కట్టా రవిశంకర్‌, కముజు చిన్న, కముజు శ్రీనివాస్‌, ములపల్లి స్వామి, కొత్తల కృష్ణబాబు, వాసర్ల ప్రవీణ్‌, వాసంశెట్టి శ్రీనివాస్‌, అల్లూరి రాజేష్‌, గంటా సుందర్‌కుమార్‌, చిగురుపాటి రాజు పాల్గొన్నారు.
పెనుగొండ : మండలంలోని వడలి గ్రామ సచివాలయం పరిధిలో హైస్కూలులో నిర్వహించిన ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో సర్పంచి కాసాని విజయకుమారి మాట్లాడారు. జనరల్‌ డాక్టర్‌ పావని, డాక్టర్‌ ఉమా మహేశ్వరి, డాక్టర్‌ చంద్రశ్రావణి, డాక్టర్‌ కోటేశ్వరరావు, కంటి వైద్య నిపుణులు ఆనంద్‌ వైద్య సేవలందించారు. ఎంపిటిసి సభ్యులు రెడ్డిగణేష్‌రావు, ఎంపిటిసి సభ్యులు చిటికెన భవాని దుర్గాప్రసాద్‌, బండారు ప్రసాద్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
ఉండి : మండలంలోని ఉనుదుర్రులో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో డిసిసిబి ఛైర్మన్‌, వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్‌.నరసింహరాజు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి పిన్నమరాజు నాగలక్ష్మి, ఎంపిటిసి సభ్యులు అల్లూరి మాధవి, పార్టీ గ్రామ అధ్యక్షులు కూనపరాజు వర్మ, నాయకులు గొర్రెముచ్చు సుందర్‌కుమార్‌, పైలా సత్యనారాయణ, ఎండగండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
పాలకోడేరు : ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డిసిసిబి ఛైర్మన్‌, వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్‌.నరసింహరాజు అన్నారు. శృంగవృక్షంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని పివిఎల్‌ నరసింహరాజు, డిసిఎంఎస్‌ ఛైర్మన్‌ వేండ్ర వెంకటస్వామి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి జంగం సూరిబాబు, ఉప సర్పంచి కలిదిండి ఆనందరాజు, నాయకులు కలిదిండి కృష్ణంరాజు, ఎంపిటిసి సభ్యులు, మల్లుల సూర్యకళ, కటిక శ్రీదేవి, ఆదాడ లక్ష్మీతులసి, నరేష్‌, సిహెచ్‌వివి.పాపారావు పాల్గొన్నారు.