Oct 07,2023 21:25

పాచిపెంట.. మందులు అందజేస్తున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర

ప్రజాశక్తి-సాలూరు :  పేదలకు ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆర్థిక భరోసా ఇస్తారని డిప్యూటీ సిఎం రాజన్నదొర అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్షతో పేదలకు ఎంతో మేలన్నారు. శనివారం పట్టణంలోని 4, 5, 6 సచివాలయాలకు సంబంధించి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన వైద్యశిబిరం లో ఆయన మాట్లాడారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో నమోదు చేసుకుంటే ఖరీదైన వైద్యం అందేలా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని చెప్పారు. పేదల ఇంటి దగ్గరకే మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. వైద్యం ఖర్చు కోటి రూపాయలైనా భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రాథమిక స్థాయిలో వ్యాధి నిర్ధారణ చేసుకుంటే దాని తీవ్రతను బట్టి వైద్యం అందేలా అధికారులు చూస్తారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పువ్వల ఈశ్వరమ్మ వైస్‌ చైర్మన్లు జర్జాపు దీప్తి, వంగపండు అప్పలనాయుడు, జెసిఎస్‌ కన్వీనర్‌ గిరి రఘు, కౌన్సిలర్లు రాపాక మాధవరావు, గొర్లి వెంకటరమణ, లింగాల దుర్గా, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గొర్లి జగన్మోహన్‌ రావు డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ శివకుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జయరాం, వైసిపి నాయకులు హరి బాలాజీ పాల్గొన్నారు.
పాచిపెంట : రాష్ట్రంలో ప్రతిఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని లక్ష్యంతో ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. మండలంలోని మోసూరు గ్రామంలో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా అంగన్వాడీలు ఏర్పాటుచేసిన పౌష్టికాహార స్టాల్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి డోల బాబ్జి, గ్రామ సర్పంచ్‌ గండిపల్లి చంటి, గండిపల్లి రాము, తట్టికాయల గౌరీశ్వరరావు, ఎస్‌.రాము, కొల్లి కొత్తయ్య. డాక్టర్‌ శివకుమార్‌ పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని చినబోగిలి సచివాలయం పరిధిలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే జోగారావు ప్రారంభించారు. 490 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిఐఒ జగన్మోహనరావు, వైద్యులు కె.శిరీష, ఎం.రాధాకాంత్‌, ఉషశ్రీ, బి.అనిల్‌కుమార్‌, ఎంపిపి బి.రవణమ్మ, జెడ్‌పిటిసి ఎం.బాబ్జి, సర్పంచ్‌ కె.రాధా శ్రీనివాసరావు, ఎంపిటిసి బుజ్జి, వైసిపి నాయకులు బి.చిట్టి రాజు పాల్గొన్నారు.
కురుపాం : మండలంలో ఉదయపురం సచివాలయం వద్ద శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. మొండెఖల్‌ పిహెచ్‌సి వైద్యాధికారి బి.ప్రజ్ఞ 347 మందికి వైద్య సేవలు అందించారు. మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు నాగేంద్ర, వినరు, అమర సింహారెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
వీరఘట్టం : జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని మండల ప్రత్యేక అధికారి పి.కిరణ్‌ కుమార్‌ సూచించారు. శనివారం మండలంలోని కిమ్మి గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. 320 మందికి వైద్యాధికారులు పి.ఉమామహేశ్వరి ఎస్‌.నితీష, డి.సాయి ప్రియా, శ్రీవెంకటరమణ తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిమ్మీ, గడగమ్మ సర్పంచులు జి.రామ్మోహనరావు, ఉదయాన సూర్యనారాయణ, ఎంపిడిఒ జిజె ప్రసాద్‌ పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. గుమ్మలక్ష్మీపురం మండలం చాపరాయి బిన్నిడి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి, మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపిపి కె.దీనమయ్య, జెడ్‌పిటిసి రాధిక, వైస్‌ ఎంపిపి నిమ్మక శేఖర్‌, తహశీల్దార్‌ రాములమ్మ, ఇఒపిఆర్‌డి జగదీష్‌ కుమార్‌ పాల్గొన్నారు.
పార్వతీపురంరూరల్‌ : మండలంలోని చినబొండపల్లిలో ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే అలజంగి జోగారావు సందర్శించారు. రోగులతో మాట్లాడి వైద్యం అందుతున్న తీరును గమనించారు. వైద్యులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపిపి మజ్జి శోభారాణి, వైస్‌ ఎంపిపి బి.రవికుమార్‌, సర్పంచ్‌ గండి శంకరరావు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి వి.గురురాజు, తహశీల్దార్‌ శివన్నారాయణ పాల్గొన్నారు.