Oct 20,2023 21:52

వంగర.. వైద్య కిట్లు అందజేస్తున్న ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే కంబాల జోగులు

ప్రజాశక్తి-నెల్లిమర్ల : జగనన్న ఆరోగ్య సురక్షతో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ సురేష్‌బాబు కోరారు. శుక్రవారం మండలంలోని ఒమ్మి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్య పరిస్థితులను, వారికి చేస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రవేశపెట్టిందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి అంబళ్ల సుధారాణి, జెడ్‌పిటిసి గదల సన్యాసినాయుడు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములు నాయుడు, మండల అధ్యక్షులు చనుమల్లు వెంకట రమణ, వైస్‌ ఎంపిపిలు సారికి వైకుంఠం నాయుడు, పతివాడ సత్యంనారాయణ, టూరిజం డైరెక్టర్‌ రేగాన శ్రీనివాస్‌ రావు, ఎంపిడిఒ గిడుతూరి రామారావు, తహశీల్దార్‌ డి.ధర్మరాజు పాల్గొన్నారు. శిబిరంలో 526 మందికి వైద్య సేవలు అందించినట్లు సతివాడ పిహెచ్‌సి వైద్యాధికారి బి.సాయి నందిని తెలిపారు.
కొత్తవలస : చింతలపాలెం సచివాలయంలో జగనన్నఆరోగ్య సురక్ష శిబిరంలో 356 మందికి తనిఖీలు చేసినట్లు వైద్యాధికారి సీతల్‌ వర్మ, సీతామహాలక్ష్మి తెలిపారు. మాజీ సర్పంచ్‌ భీష్మ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సందర్శించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ శ్రీనివాస్‌ మిశ్రా, ఇఒపిఆర్‌డి ధర్మారావు, సెక్రటరీ ఎల్‌. చిన్నారావు, తదితరులు పాల్గొన్నారు.
వంగర : పేద ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. మండలంలోని మగ్గూరులో శుక్రవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొని వైద్యులు అందిస్తున్న ఆరోగ్య సేవలను పరిశీలించారు. అనంతరం ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌ బిపి తనిఖీ చేయించుకున్నారు. అనంతరం ఆయన రోగులతో మాట్లాడి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి ఉత్తరావెల్లి సురేష్‌ ముఖర్జీ, తహశీల్దార్‌ డి.ఐజాక్‌, వైసిపి నాయకులు కరణం సుదర్శనరావు, పోలిరెడ్డి రమేష్‌, బొక్కేల వెంకట అప్పలనాయుడు, గేదెల రామకృష్ణ, కనగల పారినాయుడు, కాబోతుల శ్రీనివాసరావు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
బొబ్బిలి : పట్టణంలోని తారకరామ కాలనీ, పాకీవీధిలో శుక్రవారం ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను బొబ్బిలి మున్సిపల్‌ చైర్మన్‌ లిసావు వెంకట మురళీకష్ణ రావు సందర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాసరావు, మున్సిపల్‌ మేనేజర్‌ శివప్రసాద్‌, 30వ వార్డ్‌ కౌన్సిలర్‌ వాడపల్లి వనజా కుమారీ, 31 వ వార్డు కౌన్సిలర్‌ చోడిగింజల అనసూయమ్మ, రాజ్‌ గోపాల్‌ నాయుడు, సచివాలయ కన్వీనర్లు, డాక్టర్‌ శశిభూషణరావు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
వేపాడ : మండలంలోని వీలుపర్తి గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. సర్పంచ్‌ సేనాపతి లీల ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరాన్ని ఎంపిపి డి.సత్యవంతుడు సందర్శించారు. వైద్యులు కె.రాజు, అజరు, ఉదరు కుమార్‌, జ్యోతి సేవలందించారు. సిహెచ్‌ఒ ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
శృంగవరపుకోట : ఆరోగ్య ఆంధ్ర నిర్మాణమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు. మండలంలోని దారపర్తి సచివాలయ పరిధిలో దబ్బగుంట గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, వైస్‌ ఎంపిపి ఇందుకూరి సుధారాజు సందర్శించారు. ఈ సందర్బంగా సేవలపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఐసిడిఎస్‌ సంపూర్ణ పౌష్టికాహార స్టాల్‌ను పరిశీలించారు. అనంతరం వైద్యులకు, వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సండి సోమేశ్వరరావు, మాజీ సర్పంచులు ఎర్రయ్య, బుచ్చయ్య, నాయకులు మురళీరాజు, తహశీల్దార్‌ శ్రీనివాసరావు, ఇఒ లక్ష్మి పాల్గొన్నారు.