ప్రజాశక్తి-సీతానగరం : జగనన్న ఆరోగ్య సురక్షతో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే అలజంగి జోగారావు తెలిపారు. మండలంలోని జోగంపేట సచివాలయ పరిధిలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ కె.సింహాచలం, పాల ఈశ్వర్ నారాయణ, వైసిపి మండల అధ్యక్షులు బి.చిట్టిరాజు, ఎంపిపి శ్రీరాములు నాయుడు, రవణమ్మ, జెడ్‌పిటిసి ఎం.బాబ్జి, తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్ : ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. బుధవారం మండలంలోని డోకిశిల పిహెచ్‌సి పరిధిలోని డికె పట్నంలో జెఎఎస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. అంగన్వాడీ స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో తహశీల్దార్ శివన్నారాయణ, వైద్యాధికారులు డాక్టర్ భాస్కరరావు, ఎంపిపి మజ్జి శోభారాణి, వైస్ ఎంపిపిలు సిద్ధా జగన్నాథరావు, బంకురు రవికుమార్, నాయకులు బొమ్మి రమేష్, భీమవరపు కృష్ణమూర్తి, మడక విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
సాలూరురూరల్ : జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని వైస్ ఎంపిపి రెడ్డి సురేష్ అన్నారు. మండలంలోని కొత్తవలసలో జగనన్న అరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్‌ఒ శివకుమార్, వైసిపి మండల అధ్యక్షులు సువ్వడ శ్రీనివాసరావు, ఎంపిడిఒ గొల్లపల్లి పార్వతి, సర్పంచ్ నెమలపిట్ట ధర్మావతి, కళ్యాణ్, ఐసిడిఎస్ అధికారులు, జైసింహ, నాయుడు పాల్గొన్నారు.










