Oct 09,2023 23:55

ప్రజాశక్తి-యంత్రాంగం ప్రజలకు చేరువగా మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతోనే ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిందని పలువురు అన్నారు. సోమవారం పలుచోట్ల వైద్య శిబిరాలు నిర్వహించి వైద్య సేవలందించారు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ సిహెచ్‌.నాగనరసింహారావు సాంబమూర్తి నగర్‌లో 8, 13 డివిజన్లకు సంబంధించిన శిబిరంలో పాల్గొన్నారు. వివిధ వైద్య పరీక్షలకు ఎంపికైన రోగులకు కమిషనర్‌ కిట్లు పంపిణీ చేశారు. శిబిరానికి వచ్చిన రోగులకు బిపి, చక్కెర వ్యాధి, కంటి వైద్యం తో పాటు వివిధ ఆరోగ్య సమస్యలకు సంబంధించి నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ కోన శ్రీనివాస్‌, ఎంహెచ్‌ఒ డాక్టర్‌ పథ్వీచరణ్‌, టౌన్‌ ప్లానింగ్‌ సూపరింటెండెంట్‌ శాస్త్రి, చిట్నీడి మూర్తి, ఎండి అస్గర్‌, సత్య, పెంకే రవి, చిట్నీడి సత్తిరాజు, రాయుడు వాసు, గుత్తుల సత్యవతి పాల్గొన్నారు. పెదపూడి సర్పంచ్‌ సుందరపల్లి ప్రమీల ఆధ్వర్యాన నిర్వహించిన శిబిరంలో ఎంపిడిఒ పిజవిజయభాస్కర్‌, తహశీల్దార్‌ టి.సుభాష్‌ పాల్గొన్నారు. పౌష్టికాహార స్టాల్‌ ను వారు పరిశీలించారు. వైద్య నిపుణులు శ్యామల, ఫణితేజ, నిహారిక, హిమబిందు, రజిత, రాముడు, సూర్యతేజ గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి ఎం.సత్య నారాయణరెడ్డి, ఎంపిటిసి సభ్యుడు సుందరపల్లి సుధాకర్‌, సచివాలయ కార్యదర్శులు గౌతమి చంద్ర, ఎం.చిన్ని, రాజుపాలెం ఉప సర్పంచ్‌ నాగమళ్ల వీరభద్రరావు, మాజీ సర్పంచ్‌ కట్టా రమణ, వైసిపి నేతలు పంపన నాగరాజు, దంగేటి దుర్గారావు పాల్గొన్నారు. తాళ్లరేవు సుంకరపాలెంలో తహశీల్దారు ఎస్‌.పోతురాజు, వైద్యులు ఎన్‌.శ్యామల, ఎల్‌.సురేష్‌ కుమార్‌, ఆర్‌.మాధురి, సత్తిబాబు, శ్రావణి తదితరులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సుమారు 300 మందికి వైద్య పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో సుంకరపాలెం సర్పంచ్‌ టిల్లపూడి నాగేశ్వరరావు, ఎంపిటిసి గుత్తుల శ్రీనివాస్‌, వైసిపి నాయకులు కాశి లక్ష్మణస్వామి, చేదూరి అరవింద్‌, ఇన్‌ఛార్జి కార్యదర్శి జ్యోతి సుధ పాల్గొన్నారు.