Oct 19,2023 21:02

వృద్ధురాలికి కంటి అద్దాలు అందజేస్తున్న కలెక్టర్‌

ఆరోగ్య సురక్షతో ఆరోగ్యకర సమాజంప్రజాశక్తి - రాయచోటి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఆరోగ్యకర సమాజం ఏర్పదుతుందని కలెక్టర్‌ గిరీష పిఎస్‌ అన్నారు. గురువారం రాయచోటి రూరల్‌ చెన్నముక్కపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జగనన్న సురక్ష వైద్య శిబిరంలో కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య శిబిరంలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు తీరును, పలు విభాగాలను మందుల నిల్వలను ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అందిస్తున్న వైద్య సేవలు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు. రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున జగనన్న సురక్ష ఆరోగ్య వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారన్నారు. జిల్లాలోని ప్రతి సచివాలయ పరిధిలో ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇందులో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని డాక్టర్లకు చూపించుకోవడం జరుగుతోంది, జగనన్న ఆరోగ్య సురక్ష ప్రతి వైద్య శిబిరంలో ఏడు రకాల పరీక్షలు తప్పనిసరిగా చేస్తున్నారని అన్నారు. ఇందులో అనీమియా, మధుమేహం, రక్తపోటు, కళ్ళ పరీక్షలు చేస్తున్నారని చెప్పారు. స్పెషలిస్ట్‌ డాక్టర్లు, జనరల్‌ డాక్టర్లు, రెగ్యులర్‌ ప్రభుత్వ డాక్టర్లతో పరీక్షలు చేసి ఖరీదైన మందులు ఇస్తున్నారు. ప్రతి వైద్య శిబిరంలో తప్పనిసరిగా కంటి వైద్యులు ఉంటారని, ప్రతి వైద్య శిబిరంలో అవసరమైన వారికి దాదాపు 120 మంది వరకు కంటి అద్దాలు ఇస్తున్నారు అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం ముగిసిన వెంటనే ఇంటింటికి ఎఎన్‌ఎం వచ్చి ఆరోగ్యశ్రీకి ఎవరెవరిని రెఫర్‌ చేశారో వారందరికి నెట్‌వర్క్‌ ఆస్పత్రి ద్వారా చికిత్స చేయిస్తారన్నారు. వాలంటీర్‌, ఏఎన్‌ఎంలు ఆరోగ్య సర్వేతో పాటు గ్రామ సచివాలయ పరిధిలోని సిడిఎన్‌సిడి సర్వే జాబితా వివరాలు ఆధారంగా రోగులను గుర్తించి ఏ ఒక్కరూ వైద్యానికి దూరం కాకుండా మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆయా సచివాలయాల పరిధిలో ప్రజలందరూ ఈ జగనన్న సురక్ష వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టరు కోరారు. అనంతరం ఎపిఐఐసి డైరెక్టర్‌ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ పేదల కోసం ముఖ్యమంత్రి జగనన్న ఎంతో పాటు పడుతున్నారని, అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను అత్యంత పటిష్టవంతంగా నిర్వహిస్తున్నందుకు కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆర్‌ మమత, మండల స్పెషల్‌ అధికారి బి.రాజశేఖర్‌ రెడ్డి, ఎంపిటిసి రామచంద్రారెడ్డి, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కె.కొండయ్య, ఎంపీడీవో మల్‌ రెడ్డి, వైద్యాధికారులు, ప్రజలు పాల్గొన్నారు. మదనపల్లె అర్బన్‌: మదనపల్లె మండలం కొత్తవారి పల్లి-2 విలేజ్‌ హెల్త్‌ క్లినికులో గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహి ంచారు. డివిజనల్‌ డెవలప్మెంట్‌ ఆఫీసర్‌ లక్ష్మీపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య సంరక్షనే లక్ష్యంగా మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు ఎంపిడిఒ భాను ప్రసాద్‌ మాట్లాడుతూ మదనపల్లి మండలంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను విజయవంతంగా నిర్వహించడంతోపాటు ప్రజా ప్రతినిధులు,అధికారుల సమన్వయంతో ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బుడ్డన్న, ఎంపిటిసి ప్రియాంక సుధాకర్‌, పంచాయతీ కార్యదర్శి గిరిధర నాయక్‌,డాక్టర్లు, ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.నందలూరు : పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఎంపిపి మేడా విజయభాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని ఎర్ర చెరువుపల్లిలో ఎంపిడిఒ సౌభాగ్యమ్మ అధ్యక్షతన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడికల్‌ క్యాంపులో ప్రతి ఒక్కరూ పరీక్షలు నిర్వహించుకోవాలని ఎంపిపి కోరారు. అనారోగ్యంగా ఉన్న వారికి విలువైన వైద్యం అందేలా ఆరోగ్య సురక్ష ద్వారా రెఫర్‌ చేసి సంబంధిత ఆస్పత్రిలో ఉచితంగా చికిత్స పొందేందుకు సదుపాయాలు కల్పించారని అన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ సౌభాగ్యమ్మ, ప్రభుత్వ వైద్యాధికారిని సజన, డాక్టర్‌ చంద్రశేఖరెరెడ్డి, వైసిపి నాయకులు వాలంటీర్లు, సచి వాలయ సిబ్బంది పాల్గొన్నారు.పెనగలూరు: మండలంలోని కొండూరు సచివాలయం ప్రాంగణంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎపి స్కిల్‌ డెవలప్మెంట్‌ చైర్మన్‌ కొండూరు అజరురెడ్డి హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఉచిత మెడికల్‌ క్యాంపులను సద్వినియోగం చేసుకొని వైద్యసేవలు పొందాలన్నారు. కార్యక్రమంలో ఎంపిపి కొండూరు సౌందర్య మండల తాసిల్దార్‌ శ్రీధర్‌రావు, ఎంపిడిఒ వరప్రసాద్‌, ఎఒ పద్మభూషణ్‌రెడ్డి, జడ్పిటిసి సుబ్బరాయుడు, సర్పంచ్‌, ఎం మురళీమోహన, ్‌ సచివాలయ ఉద్యోగులు వాలంటరీలు పాల్గొన్నారు.