Oct 01,2023 01:04

పల్నాడు జిల్లా: నరసరావుపేట అర్బన్‌ పరిధిలో బాబా పేట ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ లో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష కార క్రమాన్ని కలెక్టర్‌ ఎల్‌. శివశంకర్‌, జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ప్రారం భించారు. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, గుర్తింపు కార్డులు మంజూరు చేశారు. రోగులతో ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ పాల్గొన్నారు. ఈపూరు: కొచ్చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొండ్రముట్లలో 510 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరాన్ని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారిణి డి గీతాంజలి పర్యవేక్షించారు. వైద్య శిబిరంలో ఎముకల వైద్య నిపుణులు సాత్విక్‌,పిల్లల వైద్య నిపుణులు రాంబాబు, కొచ్చెర్ల ప్రాథమిక వైద్య అధికారిణి నాగేంద్రబాబు, ముప్పాళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిణి షమీమా రోగులకు వైద్య పరీక్షలు చేశారు. అమరావతి : స్థానిక శ్రీ రామకృష్ణ హిందూ హైస్కూల్‌లో 'ఆరోగ్య సురక్ష ' నిర్వహించారు. రాష్ట్ర ఎంపిపిల సంఘం కన్వీనర్‌, అమరావతి ఎంపిపి మేకల హనుమంతరావు పాల్గొన్నారు. అనంతరం ఐసిడిఎస్‌ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ ను పరిశీలించారు. పిల్లలకు, గర్భిణులకు, బాలిం తలకు అందించే పౌష్టికాహారం పై అంగన్వాడీ సిబ్బందిని ఆరా తీశారు. మాచర్ల్ల : స్థానిక నెహ్రునగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని వైసిపి రాష్ట్ర యువజన సంఘ ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మాచర్ల చినఏసోబు, కమిషనర్‌ ఇవి రమణబాబు, వైస్‌ చైర్మన్‌ పోలూరి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. విజయపురిసౌత్‌: మాచర్ల మండలంలోని గన్నవరం సచివాలయం పరిధిలో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ముఖ్య అతిథి మాచర్ల మండల పరిషత్‌ అధ్యక్షులు బూడిద శ్రీనివాసరావు ప్రారంభించారు. గర్భిణులకు హెల్త్‌ కిట్లను అందజేశారు.కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి గభ్రు నాయక్‌ , తహశీల్దార్‌ హుసేన్‌,ఎం.పి.డి.ఓ సరోజిని దేవి తదితరులు పాల్గొన్నారు. యడ్లపాడు:మండలంలోని కారుచోలలో జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహించారు. జడ్పీ హైస్కూల్‌,యూపీ పాఠశాల ఒకే ప్రాంగణంలో ఉన్నప్పటికీ జడ్పీ వరకు మాత్రమే సెలవు ప్రకటించి, యుపి స్కూల్‌ విద్యార్థులకు యథావిధిగా తరగతులు కొనసాగించారు. దీంతో యూపీ పాఠశాలలోనే వైద్య సిబ్బంది వివిధ రకాల పరీక్షలు రోగులకు నిర్వహిస్తుండగా పక్కనే ఉన్న చిన్నారులు మధ్యాహ్నం భోజనం చేయాల్సి వచ్చింది. పిల్లలకు సెలవు ఇవ్వకుండా ఈవిధంగా చేయ డంపౖౖె మండిపడ్డారు. ఈ విషయం గ్రహించిన అధి కారు లు, భోజనాల అనంతరం విద్యార్థులను ఇళ్ళకు పంపిం చారు. అదే ప్రాంగణంలో ఉన్న అంగన్వాడీ కేం ద్రానికి సెలవు ప్రకటించకపోవడాన్ని గ్రామస్తులు తప్పు పడుతున్నారు.