Oct 25,2023 21:04

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ, జిజిహెచ్‌, తదితర వాటికి వైద్యులు చేసిన రెఫెరల్స్‌ మీద దష్టి సారించాలని కలెక్టర్‌ గిరీష అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో మెడికల్‌ ఆఫీసర్స్‌, మండల స్పెషల్‌ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, తదితర అధికారులతో జగనన్న ఆరోగ్య సురక్ష, గ్రాస్‌ ఎన్రోల్మెంట్‌ రేషియో తదితర అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 2941 పేషంట్లను జిజిహెచ్‌ తదితర వాటికి రెఫెరల్స్‌ పంపినట్టుగా తెలుస్తోందని, వారందరినీ ఎఎన్‌ ఎంలకు మ్యాప్‌ చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మంచి వైద్యులు ఉంటే రెఫెరల్స్‌ అవసరం లేదని తెలిపారు. జిల్లాలో చాలామంది ఆరోగ్యశ్రీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారని అయితే వాటిలో లాగిన్‌ అవ్వలేదని పేర్కొన్నారు. డౌన్‌లోడ్‌ చేసుకున్న వారందరూ లాగిన్‌ అయ్యేలా చర్యలు తీసుకో వాలని ఎంపిడిఒలను, మండల స్పెషల్‌ ఆఫీసర్లను ఆదేశించారు. అనంతరం గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో మీద సమీక్షిస్తూ వ్యాలిడేషన్‌ మీద దష్టి సారించాలని, తప్పులు లేకుండా గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డిఎంహెచ్‌ఒ కొండయ్య, మెడికల్‌ ఆఫీసర్లు, ఎంపిడిఒలు, మండల స్పెషల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు