
ప్రజాశక్తి - చింతలపూడి
జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతిఒక్కరు ఉపయోగించుకోవాలని ఎంపిపి రాంబాబు తెలిపారు. నగరపంచాయతీలో కమిషనర్ ఎన్.రాంబాబు ఆధ్వర్యంలో సోమవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ స్టాల్ పరిశీలించారు. ప్రతి ఒక్కరికి పోష్టికాహారం అందించాలని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని అంగన్‌వాడీ సూపర్ వైజర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ అనారోగ్య సమస్యలు ఉన్నవారు జగనన్న సురక్ష కార్యక్రమానికి వచ్చి ఉచిత వైద్య సేవలు, మందులను ఉపయోగించుకోవాలన్నారు. అవసరమైన వారికి ఇసిజి కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్క కుటుంబానికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి కార్యకర్తలు కాంతారావు, ఇమ్మానుయేలు, వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.