ప్రజాశక్తి - కర్లపాలెం
సిఎం వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే ప్రజారోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని నల్లమోతువారిపాలెం ఎంపిటిసి, మాజీ సైనిక సంక్షేమ సంఘం జిల్లా అద్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్ళి కరపత్రాలు పంచుతూ ప్రజలకు అందించే వైద్య సదుపాయాలను వివరించారు. ప్రజల ఆరోగ్యం, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రలను ఆధునికరించి, వైద్య సేవలను మెరుగు పర్చారని అన్నారు. వైద్య సేవలను ప్రజల ముందుకు చేర్చారన్నారు. పేదల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ముందుగానే వైద్యసేవలు అందించేందుకే ఈ పదకం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో నల్లమోతువారిపాలెం పంచాయతీ సెక్రటరీ పి వెంకటేశ్వరరావు, ఎఎన్ఎం రత్నమాల, విలేజ్ హెల్త్ క్లినిక్ ఆఫీసర్ అనూష పాల్గొన్నారు.










