ఆరోగ్య సురక్షను సద్వినియోగం చేసుకోవాలి- ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ బాషా
కడప అర్బన్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని ఆరోగ్య వంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు జగనన్న ఆరోగ్య సురక్షను సద్వినియోగం చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్‌బాషా పేర్కొన్నారు. మంగళవారం స్థానిక నకాశ్‌వీధి పెద్ద దర్గా ప్రాంత సమీ పంలోని ఖాళీ ప్రదేశ మైదానంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మండి బజర్, బల్లారి రోడ్డు, అబ్దుల్ నబీ స్ట్రీట్, ఖలీల్ నగర్, నకాశ్ ప్రాంతాలకు సంబంధించి జగనన్న ఆరోగ్య సురక్ష 2వ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ సూర్య రమణా రెడ్డి, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఇబ్రహీం మియా, యువనాయకుడు ఎస్. బి. అహమ్మద్ బాషా, నాయకులు నారపురెడ్డి సుబ్బారెడ్డి, తోట కష్ణ, సుబాన్ బాషా, చాక్లెట్ గౌస్, పవర్ అల్తాఫ్, రిజ్వాన్, కార్పొరేటర్లు అరీఫుల్లా, జహీర్, అక్బర్ అలీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.నాగరాజు, వైద్యులు వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చెన్నూరు : ఈనెల 5 నుంచి 24 వరకు నిర్వహి ంచబోయే జగనన్న ఆరోగ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల అధ్యక్షులు చీర్ల సురేష్ యాదవ్ అన్నారు. మంగళవారం ఎంపిడిఒ సభాభవనంలో ఎంపిడిఒ డి. సుబ్రహ్మణ్యంశర్మ అధ్యక్షతన జగనన్న ఆరోగ్య సురక్ష పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్షపై ప్రతి గ్రామంలో ఆయా ప్రజా ప్రతినిధులు, వాలంటీర్లు ఆరోగ్య సురక్ష కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో మండల ప్రత్యేక అధికారి వెంకటసుబ్బయ్య, మండల ఉపాధ్యక్షులు ఆర్‌ఎస్‌ఆర్( చిన్న), సొసైటీ అధ్యక్షుడు అల్లి శ్రీరామ్మూర్తి, డిప్యూటీ కాసుల వెంకటరమణ, ఒపిఆర్‌డి సురేష్‌బాబు వైద్యాధికారి డాక్టర్ చెన్నారెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దిలీప్ కుమార్ రెడ్డి, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను సుబ్బారెడ్డి పాల్గొన్నారు ముద్దనూరు : జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని జిఎన్ ఎస్‌ఎస్ కలెక్టర్ రాము నాయక్, ఎంపిడిఒ సూర్యనారాయణ రెడ్డి అన్నారు. మండలంలోని నల్లబల్లె గ్రామ సచివాలయంలో మంగళవారం మండల సచివాలయం కన్వీనర్ చింతాటి సుమంత్ యాదవ్, సర్పంచ్ గుగ్గుళ్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తహశీల్దార్ వెంకటేశ్వర్లు, గ్రామ నాయకులు రామారెడ్డి, వైసిపి, సింగిల్ విండో డైరెక్టర్ శివారెడ్డి, వైసిపి నాయకులు మణికంఠరెడ్డి, లక్ష్మీ నారాయణరెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, ప్రజలు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చాపాడు : ప్రజలకు వైద్యం అందుబాటులోకి తేవడడే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని భద్రిపల్లె గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే వైద్య సేవల తీరును పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎంపిపి టి లక్ష్ముమయ్య, నియోజకవర్గ ప్రత్యేక అధికారి చంద్రశేఖర్, మండల ప్రత్యేక అధికారి సురేష్‌రెడ్డి, ఎంపిడిఒ శ్రీధర్ నాయుడు, తహశీల్దార్ యామిని, మండల వైద్యాధికారులు రాజేష్‌కుమార్, శ్రీవాణి, ఎంఎస్ తేజ, సర్పంచ్ గుత్తి మల్లేశ్వరి, వైసిపి మండల కన్వీనర్ రాజశేఖర్‌రెడ్డి, వైసిపి నాయకులు పివి రమణారెడ్డి, అబ్బిరెడ్డి, ఓబుళరెడ్డి, శ్రీనువాసులరెడ్డి, రామాంజనేయులరెడ్డి, నరసింహారెడ్డి, పుల్లయ్య, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్) : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమంతోపాటు ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించడం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక శ్రీరాములపేటలోని కాన్పులాసుపత్రి, ఎంపిడిఒ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యేకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ లక్ష్మిదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్లు బంగారు మునిరెడ్డి, జేపిఎస్, జిల్లా కో-ఆర్డినేటర్ కల్లూరు నాగేంద్రరెడ్డి, ఎంపిపి శేఖర్ యాదy,్ గరిశపాటి లక్ష్మిదేవి, పోరెడ్డి నరసింహారెడ్డి, కమాల్‌బాషా, మల్లికార్జున యాదవ్, వరికూటి ఓబుల్‌రెడ్డి, దేవి, జిలానీ, సత్యం, వంశీధర్‌రెడ్డి, కశిరెడ్డి మహేశ్వరరెడ్డి, వేణుగోపాల్ పాల్గొన్నారు. జమ్మలమడుగు : ప్రజా ఆరోగ్యానికే ప్రభుత్వం మొదట ప్రాధాన్యతనిస్తుందని, అందులో భాగంగానే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని సాయిబాబా దేవాలయం వద్ద ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్‌లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వేల్పుల శివమ్మ, వైస్ చైర్మన్ పోరెడ్డి రామలక్ష్మమ్మ, మున్సిపల్ కమిషనర్ జి.వెంకట్రామిరెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఖాజీపేట : వైసిపి ప్రభుత్వం పేదల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని రావులపల్లెలో జగనన్న సురక్ష యోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై వైద్య సేవలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిపి అబూబకర్ సిద్దిక్, ఎంపిటిసి కనపర్తి సుబ్బారెడ్డి, వైసిపి నాయకులు దుగ్గిరెడ్డి గంగాధర్‌రెడ్డి, అగ్రహారం సహకార సంఘం అధ్యక్షుడు పివి రాఘవరెడ్డి, మండల కన్వీనర్ మురళీమోహన్‌రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు శివరామిరెడ్డి, అంగన్వాడీ కార్యకర్త జంపన గంగావతి, అంగన్వాడీ సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










