
ప్రజాశక్తి - పెనుమంట్ర
మండలంలోని పొలమూరు హైస్కూల్ ఆవరణలో గురువారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్నిప, అంగన్ వాడీ కార్యకర్తలు ఏర్పాటుచేసిన పౌష్టికాహార ప్రదర్శనను రాజమండ్రి రుడా ఛైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి కాకర రాజేశ్వర రావు, ఎంపిపి కర్రి వెంకటనారాయణరెడ్డి (వాసురెడ్డి), జెడ్ పిటిసి సభ్యులు కర్రి గౌరీ సుభాషిణి, గ్రామ అద్యక్షులు కలిదిండి దినేష్‌రాజు, ఎంపిటిసి సభ్యులు పెచ్చెట్టి నరసిం హమూర్తి, గ్రామ నాయకులు వడ్లమూడి ప్రదీప్ కుమార్, కొలుకులూరి సతీష్, కుసుమే సురేష్ బాబు పాల్గొన్నారు.
పాలకొల్లు రూరల్ :మండలంలోని సగం చెరువు సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. వైసిపి పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుడాల గోపీ ముఖ్యఅతిథిగా హాజర య్యారు. సగంచెరువు సర్పంచి నాగమణి, గోరింటాడ సర్పంచి పావని కార్యక్రమాన్ని నిర్వహించారు.
పోడూరు :అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో సిఎం జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని వైసిపి పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుడాల గోపీ అన్నారు. మండ లంలోని కొమ్ముచిక్కాల గ్రామంలో గురువారం నిర్వహించిన జగన్నన సురక్ష కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు గుంటూరి పెద్దిరాజు, ఎంపిపి సబ్బితి సుమంగళి, గుంటూరి చంటిరాజు, సర్పంచి మురళీరాజు, బాలాజీ పాల్గొన్నారు.
నరసాపురం టౌన్ : మండలంలోని మల్లవరం, మల్లవరం లంక గ్రామాలకు సంబంధించిన జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపు గురువారం మల్లవరం గ్రామ సచివాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అనంతరం మల్లవరం సచివాలయం వద్ద రూ:5 లక్షలతో అభివృద్ధి పరిచిన ఫిల్టర్ బెడ్‌ను ప్రారంభించారు.
వీరవాసరం :రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని భీమవరం ఎఎంసి ఛైర్మన్ కోటిపల్లి బాబు అన్నారు. మండలంలోని తోకలపూడిలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో నిర్వహించిన సభలో బాబు మాట్లాడారు. అనంతరం లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను బాబు, సర్పంచి వీరవల్లి శ్రీనివాసరావు చేతులమీదుగా అందించారు. అంగన్‌వాడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషకాహార స్టాల్ పట్ల బాబు సంతృప్తి వ్యక్తం చేసి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్ కడలి ధర్మారావు, వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ గొలగాని సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, కోడి అప్పారావు, ఎంపిడిఒ జ్యోతి పాల్గొన్నారు.