
ప్రజాశక్తి - వీరవాసరం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలకు ప్రజల మన్ననలు పొందుతుందని భీమవరం ఎఎంసి ఛైర్మన్ కోటిపల్లి బాబు అన్నారు. బలుసులగొయ్యిపాలెంలో జగనన్న సురక్ష వైద్యశిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారం భించారు. ఈ సందర్భంగా కోటిపల్లి బాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచి ఇళ్ల పూర్ణబాల భారతి, వైసిపి మండల కన్వీనర్ కడలి ధర్మారావు, ఇళ్ల శ్రీని వాస్, అధికారులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెనుమంట్ర : మండలంలోని మాముడూరులో సర్పంచి గూడూరి దేవేంద్రుడు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో రాజమండ్రి రుడా ఛైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్ వెలగల వెంకటరమణ (మిస్సమ్మ), జెడ్‌పిటిసి సభ్యులు కర్రి గౌరీ సుభాషిణి, గ్రామ అధ్యక్షుడు భోగిరెడ్డి మారుతి, సొసైటీ అధ్యక్షుడు దాట్ల గోపాలకృష్ణంరాజు (చంటిరాజు), వైస్ ఎంపిపి వాసంశెట్టి కిరణ్, ఎంపిడిఒ పి.పద్మజ, తహశీల్దార్ దండు అశోక్‌వర్మ పాల్గొన్నారు.
గణపవరం : మండలంలోని ఎస్.కొండేపాడులో మంగళవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంపిడిఒ జి.జ్యోతిర్మయి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి ఎస్.వీరవరలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సభలో ఎంపిడిఒ జ్యోతిర్మయి మాట్లాడారు.
మొగల్తూరు : మొగల్తూరులోని కుక్కలవారితోటలో ఉన్న మూడో సచివాలయం వద్ద మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు మాట్లాడారు. అనంతరం ఇళ్ల పట్టాలకు దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు పట్టాలు అందించారు.
ఉండి : మండలంలోని పాందువ్వ గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్షలో డిసిసిబి ఛైర్మన్, వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్.నరసింహ రాజు పాల్గొని మాట్లాడారు.
పెనుగొండ:మండలంలోని దొంగరావిపాలెం లో మంగళవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వైసిపి ఆచంట నియోజకవర్గ పరిశీలనకుర ాలు, రాజమండ్రి రుడా ఛైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి పాల్గొని మాట్లాడారు. అనంతరం ఆమె పౌష్టికాహార స్టాల్, ఇసిజి, వైద్య పరీక్షలను ఆమె పరిశీలించారు.
పాలకొల్లు రూరల్ : మండలంలోని లంకలకోడేరులో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో వైసిపి పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుడాల గోపీ పాల్గొన్నారు. గ్రామ సర్పంచి చొప్పల రజిని అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో గోపీ మాట్లాడారు.
నరసాపురం టౌన్ : మండలంలోని సీతారాంపురం గ్రామం నార్త్ సచివాలయం వద్ద నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపును రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు సందర్శించారు. అనంరతం ఐసిడిఎస్ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన పౌష్టికాహారం స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. నరసాపురం మున్సిపల్ పరిధిలో 23, 24, 25, 26, 27 వార్డులకు సంబంధించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్ర మం 25వ వార్డు వీవర్స్ కాలనీలో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె.వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు.