Oct 06,2023 21:38

సీతానగరం మండలం వెం.వెంకటాపురంలో వైద్య శిబిరాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే జోగారావు

ప్రజాశక్తి - భామిని :  జగనన్న ఆరోగ్య సురక్ష (జెఎఎస్‌) కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ కోరారు. మండలంలోని ఒడ్డంగిలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష ( జెఎఎస్‌) కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ శుక్రవారం తనిఖీ చేశారు. అన్ని కౌంటర్లను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది హాజరు, చికిత్స కోసం వచ్చిన ప్రజలు, వైద్య సేవలను పరిశీలించారు. ఉత్తమ సేవలు అందించాలని వైద్యులను, సిబ్బందిని సూచించారు. పేదలు, దూర ప్రాంతాల ప్రజలకు జగనన్న ఆరోగ్య సురక్ష (జెఎఎస్‌) కార్యక్రమం ఒక గొప్ప అవకాశం అన్నారు. నిపుణులైన వైద్యులు తమ వద్దకు వచ్చి వైద్య సేవలు అందించడం జరుగుతుందని వివరించారు. సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కల్పనా కుమారి, వైద్య అధికారులు పాల్గొన్నారు.
కురుపాం : మండలంలోని తిత్తిరి పంచాయతీ టోంపలపాడు సచివాలయంలో జరిగిన ఆరోగ్య సురక్ష వైద్యశిబిరం ఎంపిపి శెట్టి పద్మావతి పరిశీలించారు. జగనన్న అరోగ్య సురక్ష పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి బి. సత్యనారాయణ, ఎంపీడీవో వి.వి. శివరామప్ప, వైద్యాధికారులు, జెడ్పిటిసి జి.సుజాత, వైసిపి వాణిజ్య విభాగాల జిల్లా అధ్యక్షులు అంధవరపు కోటీశ్వరరావు,వైస్‌ ఎంపిపి లు, సర్పంచులు, ఎంపిటిసి లు, అధికారులు పాల్గొన్నారు.
నేడు జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం
సాలూరు:
పట్టణంలోని 4,5,6 సచివాలయాలకు సంబంధించి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ టి.జయరాం చెప్పారు. ఈ శిబిరానికి ఆయా సచివాలయాల పరిధిలో ఉన్న ప్రజలు, రోగులు హాజరు కావొచ్చునని ఆయన ఒక ప్రకటన లో కోరారు.
వీరఘట్టం: మండలంలోని కత్తుల కవిటిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వి.కళావతి ప్రారంభించారు. రోగులకు స్పెషలిస్టులు వైద్యులు, సిబ్బంది చేస్తున్న స్క్రీనింగ్‌ వైద్య పరీక్షలు, తదితర వాటిని పర్యవేక్షించారు. ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జి.సరోజిని, ఎంపిపి డి.వెంకటరమణనాయుడు, తహశీల్దార్‌ సత్యనారాయణ, దిలీప్‌కుమార్‌, వైద్యాధికారులు మానస, దిలీప్‌ కుమార్‌, ఉమామహేశ్వరి, భవ్య, జడ్పిటిసి జంపు కన్నతల్లి ఉమామహేశ్వరరావు, బి.గౌరినాయుడు, సచివాలయ కార్యదర్శి రాము, ఎంపిటిసి కె.పరిమిల, వైద్య సచివాలయ సిబ్బందితో పాటు విఆర్‌ఒలు, వాలంటీర్లు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామమైన వనకాబడిలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ వ్యాధులతో బాధపడుతున్న సుమారు 310 మంది రోగులు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. రోగులకు అవసరమైన మందులను అందించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ సాల్మన్‌ రాజు, ఎంఇఒ చంద్రశేఖర్‌, పంచాయతీ కార్యదర్శి శెట్టి రామకృష్ణ, నరేష్‌ ఇతర శాఖ అధికారులు, సచివాలయ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
గరుగుబిల్లి : మండలంలోని ఉల్లిభద్రలో ఈనెల 25న నిర్వహించనున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సచివాలయం కార్యదర్శి ఉప్పల పెదకోటేశ్వరరావు, కొండవరం గ్రామపంచాయతీ కార్యదర్శి చింతల వెంకట కురిమినాయుడు కోరారు. ఈ మేరకు ఉల్లిభద్ర గ్రామసచివాలయంలో సచివాలయ, వైద్య సిబ్బంది, వాలంటీర్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సిబ్బంది అంతా కృషి చేయాలని ఆదేశించారు.
సీతానగరం : మండలంలో వెంకటాపురంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొన్నారు. శిబిరాలకు వచ్చిన వారితో మాట్లాడి వైద్యం అందుతున్న విధానాన్ని ఆరా తీశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన పౌష్ఠికాహారం ప్రదర్శన శాలను పరిశీలించారు.కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్‌ రాధాకాంత్‌, శిరీష. పలు శాఖల అధికారులతో పాటు పలువురు గ్రామ పెద్దలు. పార్టీల నాయకులు. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని నీలకంఠపురంలో నిర్వహించిన జగనన్న సురక్ష క్యాంపును ఎపి టిడ్కో చైర్మన్‌ జమ్మాన్న ప్రసన్నకుమార్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమము ద్వారా గ్రామాల్లో హెల్త్‌ క్యాంపు నిర్వహించి అందులో వారికి అవసరమైన పరీక్షలు చేయడం పాటు, మందులు,ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వమే ఇస్తున్నారని అన్నారు. జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి(డిఐఒ) డాక్టర్‌ టి. జగన్మోహనరావు జెఎఎస్‌ క్యాంపు లో ప్రతీ కౌంటర్‌ వద్ద ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.
సాలూరు రూరల్‌ : మండలంలోని మరిపల్లిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్‌పర్సన్‌ దండి అనంత కుమారి, మండల వైసీపీ అధ్యక్షులు సువ్వాడ భరత్‌ శ్రీనివాసరావు, ఎంపిడిఒ పార్వతి, స్థానిక సర్పంచ్‌ తొత్తడి నారాయణమ్మ, ఎంపిటిసి జన్ని సింహాచలం, వైసిపి నాయకులు దండి శ్రీనివాసరావు, కాగాన పోలి నాయుడు, వైద్యులు అక్యాన అనిల్‌, సచివాలయ, వైద్య సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.