Sep 21,2023 23:17

ప్రజాశక్తి-అమలాపురం
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సర్వేను వేగవం తం చేయాలని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. గురువారం అమరా వతి నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి 26 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరె న్స్‌ నిర్వహించి సుస్థిరాభి వృద్ధి లక్ష్యాల సాధన, పాఠశాల విద్య, జగనన్న కాలనీలో గృహాలకు ఎలక్ట్రిసిటీ, వాటర్‌ కనెక్షన్లు ఏర్పాటు, గ్రామ వార్డు సచివాలయ స్పందన, గడప గడపకు మన ప్రభుత్వం జగనన్నకు చెబుదాం కార్యక్రమాల పురోగతిపై సమీక్షిం చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా కలెక్టర్‌ అధికా రులను ఉద్దేశించి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సర్వేను వేగవంతం చేసి గ్రామాల్లో దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులను, అనారోగ్య పరిస్థితులను గుర్తించి యాప్‌ లో నమోదు చేస్తూ ఈనెల 30 నుంచి ప్రారంభం కానున్న వైద్య శిబిరాలలో వైద్య చికిత్సలు నిర్వహించాలని ఆదేశించారు.వైద్య ఆరోగ్యశాఖ- స్త్రీ శిశు సంక్షేమ శాఖ కన్వర్జెన్సీతో పోషకాహార లోపా లు రక్తహీనతతో ఉన్న బాలింతలు గర్భిణులు, చిన్నారులను గుర్తించి స్క్రీనింగ్‌ నిర్వహిస్తూ ఆరోగ్య స్థితిగతులపై అధ్యయనం చేయాలన్నారు. జగనన్న గోరుముద్ద, సంపూర్ణ పోషణ, తదితర పోషకాహార లోపాలు సరిదిద్దే కార్యక్రమాల ద్వారా ఆయా లోపాలను సరిదిద్ద డంతోపాటు ఆరోగ్యపరంగా అందించాల్సిన చికిత్సలను ఇమ్యునైజేషన్‌ ప్రక్రియలను సకాలంలో నిర్వహించి సుస్థిరాభి వృద్ధి లక్ష్యాల సాధన దిశగా కృషిచేయాలన్నారు. ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో ఎదుగుదల లోపాలను గుర్తించి సరిచేస్తూ ప్రాథమిక విద్య నేర్వడానికి సమయాత్త పరచాలని ఆదేశించారు గర్భిణుల్లో పోషకాహార లోపాలను రక్తహీనతను సరిదిద్దుతూ సుఖ ప్రసవాలు నిర్వహించుకునేలా పటిష్టమైన ప్రసవ ప్రణాళికలను రచించి పక్కాగా అమలు పరచాలన్నారు. ఆశాలు, ఎఎన్‌ఎంలు, అంగన్‌వాడీలు,వాలంటీర్లు గృహ సందర్శనలో ప్రజలు హైజినిక్‌ వాతావరణంలో ఆరోగ్యవంతంగా జీవించే విధానాలపై అవగాహన పెంపొందించాలన్నారు. వ్యవ సాయ పరంగా ఈనెలాఖరు నాటికి ఇకెవైసి ప్రక్రియను పూర్తి చేయా లని ఆదేశించారు. జగనన్న కాలనీలో నిర్మించిన గహాలకు పూర్తిస్థాయిలో విద్యుత్‌, వాటర్‌ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెసి ఎస్‌.నుపూర్‌ అజరు, సిపిఒ వెంకటేశ్వర్లు, గ్రామ వార్డు సచివాలయం నోడల్‌ అధికారి కె.భీమేశ్వరరావు గృహ నిర్మాణ సంస్థ జిల్లా అధికారి సిహెచ్‌.బాబూరావు, డ్వామా పీడీ ఎస్‌.మధుసూ దన్‌, డిపిఒ వి.కృష్ణకుమారి, జిల్లా వ్యవసాయ అధికారి ఎ.బోసు బాబు, డిఎంఅండ్‌హెచ్‌ఒ ఎం.దుర్గారావు దొర, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ సిహెచ్‌ఎన్‌వి.కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.