Oct 25,2023 20:55

జగనన్న ఆరోగ్య సురుక్ష కిట్‌లను అందజేస్తున్న ఎమ్మెల్యే వెలంపల్లి, మేయర్‌ భాగ్యలక్ష్మి


ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలోని 43,45,53,54 డివిజన్లలో నాలుగు సచివాలయాల పరిధిలో బుధవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను ఎంఎల్‌ఎ వెలంపల్లి శ్రీనివాసరావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ మంచి వైద్యం చేసి చక్కటి మందులు ఇస్తున్నట్లు తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులకు కూడా భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. జగన్‌ మోహన్‌ రెడ్డి నిరంతరం ప్రజారోగ్యంపై శ్రద్ధ చూపుత్తున్నారన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు కషి చేస్తున్నామని తెలిపారు. గతంలో చంద్రబాబు ప్రయివేటు ఆసుపత్రులను పెంచి పోషించారన్నారు. నేడు ఆరోగ్య రంగానికి పెద్ద పీటటవేస్తున్న వ్యక్తి జగన్‌ మోహన్‌ రెడ్డి అని కొనియాడారు. అందరికీ ఇంటి ముంగిటలో వైద్య వ్యవస్థ తీసుకొచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ రాయన బాగ్యలక్ష్మి, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు బాపతి కోటిరెడ్డి, మైలవరపు మాధురి లావణ్య, మహాదేవు అప్పాజీరావు, అర్షద్‌ అకిబ్‌ తదితర కార్పొరేటర్లు పార్టీ నాయకులూ, కార్యకర్తలు, అభిమానులు తదితరులు సచివాలయం కన్వీనర్లు గహ సారథులు నగర పాలక సంస్థ అధికారులు సచివాలయం సిబ్బంది, ఆరోగ్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.