
ప్రజాశక్తి-గుంటూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. శనివారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఇజ్రాయిల్‌పేటలో ఆరోగ్య సురక్ష క్యాంప్‌ను నగర కమిషనర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య పరీక్షలతో పాటుగా అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మెరుగైన చికిత్స, మందులు అందిస్తారన్నారు. కంటికి సంబంధించిన వైద్య సేవలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. క్యాంపుల్లో విధులు కేటాయించబడిన సిబ్బంది ఓర్పుతో ప్రజలకు రిజిస్ట్రేషన్, వైద్య పరీక్షలు, ఫార్మశీ వివరాలు చెప్పాలని సూచించారు. కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని 29 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో క్యాంప్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నా మన్నారు. క్యాంపుల్లో జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్‌తో పాటు ఇద్దరు ఎంబిబిఎస్ వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. వైద్య పరీక్షలు చేసి, అవసరమైతే అందుబాటులోని హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందిస్తారని, ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తారని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యశ్రీలో గతం కంటే ఎక్కువ వ్యాధులకు చికిత్స అందుతోందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, జిల్లా వైద్య,ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రావణబాబు, సిటీ ప్లానర్ ప్రదీప్‌కుమార్, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, టి.వెంకటకృష్ణయ్య, సిహెచ్.శ్రీనివాస్, ఎంహెచ్‌ఒ డాక్టర్ భానుప్రకాష్ పాల్గొన్నారు.
క్యాంప్‌ను సందర్శించిన మేయర్
జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రతిఒక్కరికీ ఆరోగ్య భరోసా లభిస్తుందని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయడు అన్నారు. ఇజ్రాయెల్‌పేట హెల్త్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఆరోగ్య సురక్ష కేంద్రాన్ని మేయర్ సందర్శించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎం.అంజలి సత్యనారాయణ, పాల్గొన్నారు.
ప్రజాశక్తి-కొల్లిపర : మండల కేంద్రమైన కొల్లిపరలోని క్యాంప్‌ను ఎమ్మెల్యే శివకుమార్, జెడ్‌పి చైర్‌పర్సన్ హెనీక్రిస్టినాతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఎంపిపి బి.పద్మావతి, వైసిపి మండల అధ్యక్షులు ఎ.పోతురెడ్డి, డాక్టర్ లక్ష్మీ సుధా, డాక్టర్ ప్రియాంక, ఎంపిడిఒ విజయలక్ష్మి పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పొన్నూరు రూరల్, చేబ్రోలు : పట్టణంలోని 23 వార్డు ఇందిరా నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో, చేబ్రోలులో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాలను ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్య ప్రారంభించారు. పొన్నూరులో మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కోటిన్నర మందికిపైగా వైద్యసేవలు అందించే లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుందన్నారు. 64 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారని, అవసరమైన వారికి నెలకు సరిపడా మందులు ఇస్తారని తెలిపారు. 15 రోజులకు ఒకసారి ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం కంటి పరీక్షలు చేయించుకున్న వారికి ప్రభుత్వం అందజేసిన కళ్ల జోళ్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ప్రజాశక్తి - పెదనందిపాడు రూరల్ : స్థానిక జెడ్‌పి పాఠశాలలో శిబిరంలో 423 మందికి వివిధ రకాల పరీక్షలు చేసి ఆయుష్మాన్ భవ కార్డులను అందజేశారు. మండల వైద్యాధికారి డాక్టర్ బి.వి.రత్నకుమార్, మండల ప్రత్యేక అధికారి మనోరంజని, తహశీల్దార్ మహబూబ్ సుభాని, ఎంపిడిఒ రాజగోపాల్ ఇఒ నాగయ్య, సిహెచ్‌ఒ స్వామి పాల్గొన్నారు.
ప్రజాశక్తి - కాకుమాను : మండలంలోని కొండపాటూరు జెడ్‌పి పాఠశాలలో శిబిరాన్ని ఎంపిపి ఆర్.శ్రీనివాసరావు ప్రారంభించారు. జెడ్‌పిటిసి ముజావర్ గుల్జార్ బేగం, ఎంపిటిపి ఎన్.సౌజన్య, ఎస్సీ కార్పొరేషన్ ఇడి టి.ప్రేమకుమారి, తహశీల్దార్ ప్రసాదరావు, ఎంపిడిఒ రామకృష్ణ, పాల్గొన్నారు.
ప్రజాశక్తి - దుగ్గిరాల : స్థానిక నిమ్మగడ్డ ఫౌండేషన్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వైద్య శిబిరంలో దాదాపు 300 మందికి పరీక్షలు చేసి మందులు అందించారు. క్లిష్టమైన సమస్యలున్న వారిని మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రికి పంపిస్తామని డాక్టర్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ప్రభాకర్ డాక్టర్ శివ, డాక్టర్ షేక్ తాజుద్దీన్, దుగ్గిరాల, ఈమని పిహెచ్‌సి వైద్యులు ఇందిరా, సుకన్య వైద్యసేవలు అందించారు. ఎంపిపి డి.సంతోష రూప వాణి, జెడ్‌పిటిసి ఎం.అరుణ, సర్పంచ్ బి.ఖుషిబాయి పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మేడికొండూరు : స్థానిక జెడ్‌పి పాఠశాలలో వైద్య శిబిరాన్ని వైసిపి తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ ప్రారంభించారు. ఎంపిపి ఎం.స్వప్న, జెడ్‌పిటిసి కె.సిద్దయ్య, వైసిపి మండల అధ్యక్షులు టి.వంశీకృష్ణ, రాజశేఖర్, అబ్బాస్, బాజీ పాల్గొన్నారు.