Oct 27,2023 22:07

ప్రజాశక్తి - యంత్రాంగం ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని పలువురు వెల్లడించారు. జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం జెఎఎస్‌ శిబిరాలు జరిగాయి. గోకవరం మండలంలోని తిరుమలాయపాలెంలో జెఎఎస్‌ కార్యక్రమంలో ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భ:గా వైద్య సేవలను, పౌష్టికాహార ప్రదర్శనను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు దాసరి రమేష్‌, సుంకర వీరబాబు, కర్రీ సూరారెడ్డి, చింతల అనిల్‌ కుమార్‌, ఎంపిడిఒ కె.పద్మజ్యోతి, సెక్రటరీ గోవింద్‌, తదితరులు పాల్గొన్నారు. కడియం స్థానిక సచివాలయం-2 వద్ద జరిగిన జెఎఎస్‌ కార్యక్రమంలో రూరల్‌ నియోజకవర్గ వైసిపి కో-ఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌ పాల్గొన్నారు. శిబిరానికి వచ్చిన రోగులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గిరజాల బాబు, తాడాల చక్రవర్తి, బొట్టు చిన్ని, ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. ఉండ్రాజవరం మండలంలోని తాడిపర్రులో జెఎఎస్‌ కార్యక్రమం జరిగింది. సర్పంచ్‌ కరుటూరి నరేంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపిపి పాలాటి యల్లారీశ్వరి, కఠారి సిద్ధార్థ రాజు, ఎంపిటిసి సభ్యులు కట్టా వెంకటేశ్వరరావు, ఎంపిడిఒ, పంచాయతీ కార్యదర్శి, విఆర్‌ఒ, వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడి సూపర్వైజర్లు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. చాగల్లు మండలంలోని ఎస్‌.ముప్పవరంలో జెఎఎస్‌ శిబిరాన్ని ఎంపిడిఒ బి.రాంప్రసాద్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ముప్పిడి మహాలక్ష్మి, ఎంపిటిసితోపాటు, పంచాయతీ కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఐసిడిఎస్‌ సూపర్వైజర్లు, కార్యకర్తలు, ఆశాలు, పంచాయతీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నంలో జెఎఎస్‌ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుర్రాల జ్యోస్నా, జడ్‌పిటిసి చల్లమళ్ళ వెంకటలక్ష్మి సుజీరాజు పాల్గొన్నారు. మండల వైద్యాధికారి డాక్టర్‌ ఎన్‌.రాజు, డాక్టర్‌ ఇ.యేసురాణి, డాక్టర్‌ రఘు వైద్య సేవలందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సరిపల్లి అనురాధ, ఎంపిటిసి ఉస్సే ఏసమ్మ, పంచాయతీ కార్యదర్శి డి మున్నీదీప్తి, తదితరులు పాల్గొన్నారు.