వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం జగన్
ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం 'జగనన్న ఆరోగ్య సురక్ష'
ప్రజాశక్తి-నెల్లూరు:రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని, వారి ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపడమే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ పద్దతిన అన్నీ జిల్లాల కలెక్టర్ల తో సమావేశమై, రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుండి 45 రోజుల పాటు నిర్వహించనున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని, వారి ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపడం, ఆలాగే ఆరోగ్య శ్రీ పధకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొనేలా అవగాహన కల్పించడం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రజలకు అవసరమైన సుమారు 98 లక్షల సర్టిఫికెట్లను అందచేసి వారి సమస్యలకు పరిష్కారం చూపించామన్నారు. అదే స్పూర్తితో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేలా అన్నీ జిల్లా కలెక్టర్ల కషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్‌ను ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని సంబంధిత లైన్ డిపార్టుమెంట్ల అధికారులు అందరూ సమన్వయంతో వ్యవహరిస్తూ మంచి ఫలితాలను సాదించేలా కషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో విస్తత అవగాహన కల్పించేందుకు ఈ నెల 15 నుండి వాలంటీర్ల ఇంటింటి ప్రచారము, 16 నుండి ఏ.ఎన్.ఎం./సి.హెచ్.ఓ.ల ఇంటింటి సర్వే నిర్వహించి సాదారణ వ్యాధులతో పాటు దీరకాలిక వ్యాధులు, గర్బిణీలు, బాలింతలు, తగిన బరువు లేని పిల్లలు, నాన్ కమ్యూనబుల్ వ్యాధులతో బాధపడేవారి వివరాలను జగనన్న ఆరోగ్య సురక్ష యాప్ లో పొందపర్చడం జరుగుతుందన్నారు. సర్వే వివరాలు పక్కాగా నమోదు అయ్యేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేక దష్టి సారించాలన్నారు. సెప్టెంబరు 30 నుండి ప్రతి మండలంలో రోజుకి కనీసం ఒక వైద్య శిభిరం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నున్న 678 మండలాల్లో ప్రణాళికా బద్దంగా ఈ శిభిరాలు నిర్వహించేందుకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించామన్నారు. ఈ నెల 30వ తేదీన ప్రతి మండలంలో ఒక మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రతి మండలంలో నెలకు కనీసం 4 గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల సిబ్బందిని, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ వైద్య శిభిరాల్లో సాధారణ వైద్యులతో పాటు ఆర్థో, గైనకాలజీ, పీడియాట్రిక్స్ తదితర విబాగాల వైద్య నిపుణులు పాల్గొనేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి మండలంలోనూ నిర్వహించే ఈ వైద్య శిభిరాల్లో సంబందిత మండల ఎంపిడిఓ, తహశీల్దార్, స్థానిక పి.హెచ్.సి. వైద్యులు తప్పని సరిగా పాల్గొనేలా చూడాలన్నారు. ఈ శిబిరాలకు వచ్చే రోగులకు అవసరమైన ఔషధాలను వెంటనే అందజేయాలని, అందుకు అవసరమైన ఔషదాలు అన్నింటినీ ముందుగానే నిల్వ ఉంచుకోవాలన్నారు. అందుకు తగ్గట్టుగా ముందుగానే తగిన పరిమాణంలో ఔషధాలను కొనుగోలు చేసుకుని సిద్దంగా ఉంచుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణం నుండి కలెక్టర్ యం. హరి నారాయణన్, కార్పొరేషన్ కమీషనర్ వికాస్ మర్మత్, జడ్పి సీఈఓ చిరంజీవి, డిపిఓ సుస్మిత, డిఆర్డీఏ పిడి సాంబశివా రెడ్డి, జిల్లా విద్యా శాఖాధికారి గంగా భవాని, ఐటీడీఏ పిఓ మందా రాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పెంచలయ్య, ఆరోగ్య శ్రీ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్, డిసిహెచ్‌ఎస్ డా. రమేష్ నాథ్, ఐసీడీఎస్ పిడి హేన సుజన తదితరులు పాల్గొన్నారు.










