ఆరోగ్య సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న వైద్యులు
ప్రజాశక్తి-కారంచేడు: మండలంలోని స్వర్ణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు ఓరల్ గ్లూకోస్ టోలరెన్స్ టెస్ట్‌పై ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలకు అవగాహన కార్యక్రమం గురువారం జరిగింది. గర్భిణులకు డయాబెటిస్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శాలిని మాట్లాడుతూ గర్భిణులను ప్రతినెల విధిగా ఆసుపత్రికి తీసుకురావాలని ఓజిటిటి పరీక్షలు నిర్వహించాలన్నారు. ఐదు ఆరు నెలల గర్భిణులను తప్పకుండా వైద్యశాలకు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఏఎన్‌ఎంలు నాగలక్ష్మి దేవనమ్మ, అరుణ, ఎంఎల్‌హెచ్‌పిలు అనూష, నూర్జహాన్, అశ్విని పాల్గొన్నారు.










