ప్రజాశక్తి- డెంకాడ : ప్రజారోగ్య సంరక్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తెలిపారు. మండలంలో గుణుపూర్‌పేట గ్రామంలో శుక్రవారం ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి, వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అంధవరపు సూరిబాబు, ఎంపిపి బంటుపల్లి వాసుదేవరావు, జెడ్‌పిటిసి బి.లక్ష్మి, వైస్ ఎంపిపి పిన్నింటి తమ్మినాయుడు, ఎంపిడిఒ డిడి స్వరూప రాణి, సర్పంచులు పైల ముత్యాలరావు, అట్టాడ శివకృష్ణ, కోరాడ కనకరాజు, మహంతి సత్యం, నాయకులు బడకొండ రామనాయుడు, బి.రమణ, పైడిరాజు, శ్రీను, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
పూసపాటిరేగ : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకుంటున్నారని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తెలిపారు. శుక్రవారం మండలంలోని కుమిలిలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని సర్పంచి మామిడి అప్పయ్యమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటుచేశారు. వైద్య శిబిరాలు, స్టాళ్లను ఆయన పరిశీలించారు. రోగులకు మందులు పంపిణీ చేశారు. వైఎస్‌ఆర్ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కళ్లద్దాలు అందజేశారు. ఈ శిబిరంలో 871 మందికి వివిధ పరీక్షలు చేసి, మందులు అందించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అంధవరపు సూరిబాబు, ఎంపిపి మహంతి కళ్యాణి, జెడ్‌పిటిసి మహంతి సీతాలక్ష్మి, వైసిపి మండల అధ్యక్షులు పతివాడ అప్పలనాయుడు, జెసిఎస్ మండల కన్వీనర్ మహంతి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ గుజ్జు సురేష్ రెడ్డి, వైద్యులు డాక్టర్ రాజ్‌కుమార్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

కొత్తవలస : కాటకపల్లి సచివాలయ పరిధిలో ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదలందరికీ ఆరోగ్య భరోసా కల్పించడానికి ప్రభుత్వం ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ, జెడ్‌పిటిసి నెక్కల శ్రీదేవి, పిఎసిఎస్ అధ్యక్షులు గొరపల్లి శివ, వైస్ ఎంపిపి మేలాస్త్రి అప్పారావు, వైసిపి మండల అధ్యక్షులు ఒబ్బిన నాయుడు, జెసిఎస్ ఇన్‌ఛార్జి బొంతల వెంకట్రావు, సర్పంచులు పీతల కృష్ణ, భూసాల దేవుడు పాల్గొన్నారు.
మెంటాడ : మండలంలో బడేవలస గ్రామంలో సర్పంచ్ మీసాల పార్వతి ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఎంపిపి రెడ్డి సన్యాసినాయుడు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపిటిసి విజయ, ఎంపిడిఒ త్రివిక్రమరావు, వైసిపి అధ్యక్షులు రాయపల్లి రామారావు, లెంక రత్నాకర్ నాయుడు, సచివాలయ కన్వీనర్ కనిమెరక త్రినాథ్, కొంపంగి సర్పంచ్ రమణ, వైద్యాధికారులు షేక్ జిలాన్ భాష, లోకప్రియ ,పద్మావతి, మూర్తి పాల్గొన్నారు
వేపాడ : ఆతవ గ్రామంలో శుక్రవారం జగనన్న సురక్ష ఆరోగ్య వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సందర్శించారు. కార్యక్రమంలో ఎంపిపి డి.సత్యవంతుడు, జెడ్‌పిటిసి ఎస్.అప్పలనాయుడు, ప్రత్యేకాధికారి లకీëనారాయణ, తహశీల్దార్ ప్రసన్నకుమార్, ఎంపిడిఒ బిఎస్‌కెఎన్ పట్నాయక్, డిటి సన్యాసినాయుడు, పిహెచ్‌సి వైద్యాధికారి ఎ.ధరణి, ఆంజనేయులు, కార్యదర్శి నానిబాబు పాల్గొన్నారు.
శృంగవరపుకోట : ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు. పట్టణంలోని గ్రామ సచివాలయం-2 పరిధిలోని, చింతబడి పాఠశాల ఆవరణలో శుక్రవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంపూర్ణ పౌష్ఠికాహార స్టాల్‌ను పరిశీలించారు. వైద్యులకు, వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపిపి సండి సోమేశ్వరరావు, వైస్ ఎంపిపి ఇందుకూరి సుధారాజు, సర్పంచ్ గనివాడ సంతోషికుమారి, వార్డు మెంబర్ శేఖర్, వంశీ, మాజీ సర్పంచ్ కె.వెంకటరావు, నాయకులు గంగరాజు, బోజంకి గోవింద్, ఇఒపిఆర్‌డి లక్ష్మి, ఇఒ కన్నబాబు పాల్గొన్నారు.










