Oct 17,2023 15:51

ప్రజాశక్తి - చింతలపూడి
   ప్రజారోగ్య పరిరక్షణకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని చింతలపూడి సచివాలయం కన్వీనర్‌ త్సల్లాబత్తుల శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని వెంకటాద్రిగూడెంలో మంగళవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమంలో డెంగ్యూ, మలేరియా, బిపి, షుగరు వంటి 9 రకాల రోగాలకు ఉచిత వైద్యం, మందులు ఇస్తున్నారని తెలిపారు. అనంతరం జెడ్‌పి సిఇఒ రవి కుమార్‌ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ మురళీకృష్ణ, వైసిపి నాయకులు జానారెడ్డి, ఎంపిటిసి కృష్ణరావు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ లీలా, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.