Oct 19,2023 20:00

వృద్ధులకు కంటి అద్దాలను అందజేస్తున్న ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చడమే లక్ష్యం : ఎమ్మెల్యే

ప్రజాశక్తి - బనగానపల్లె

రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చడమే జగనన్న లక్ష్యమని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని ఇల్లూరు కొత్తపేట గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంను ఎమ్మెల్యే ప్రారంభించారు. వైద్య శిబిరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ అవుకు మండల కన్వీనర్‌ కాటసాని తిరుపాల్‌ రెడ్డి, ఎంపీడీవో శివరామయ్య, తహశీల్దార్‌ కిషోర్‌ కుమార్‌ రెడ్డి, టంగుటూరు పిహెచ్‌సి మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శివ శంకరుడు, డాక్టర్‌ సోహెల్‌, గ్రామ సర్పంచి గోగుల రమణ, పంచాయతీ సెక్రెటరీ నాయక్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్యాపిలి : ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకే జగనన్న ఆరోగ్య సురక్ష అని జడ్పీటీసీ బోరెడ్డి శ్రీరామరెడ్డి, మండల వైసీపీ కన్వీనర్‌ బోరా మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. ప్యాపిలిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్షలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈవో శివకుమార్‌ గౌడ్‌,డాక్టర్లు నుశ్రత్‌,నితీష్‌,రమ్య శిల్ప సిబ్బంది పాల్గొన్నారు. బేతంచర్ల : రాష్ట్ర క్షేమాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి అన్నారు. బేతంచర్ల పట్టణంలోని అల్లా బకాష్‌ దర్గా, డ్రైవర్స్‌ కాలనీలో నిర్మింపబడిన ఆరోగ్య ఉప కేంద్రం నందు, ఆర్‌ కొత్తపల్లి గ్రామం నందు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నగర పంచాయతీ చైర్మన్‌ సిహెచ్‌ చలం రెడ్డి, కొత్తపల్లి ఎంపీటీసీ మునీశ్వర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ నాగభూషణం రెడ్డి, చైర్మన్‌ చలం రెడ్డి, ఎంపీటీసీ మునీశ్వర్‌ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ కుంచే తిరుమలేశ్వర్‌ రెడ్డి, కొత్తపల్లి సర్పంచ్‌ మహాలక్ష్మి, డాక్టర్‌ సాగరిక,గూని నాగరాజు, ఎద్దులన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.చాగలమర్రి : పేదలు ఆరోగ్యంగా ఉండాలనే ఉధ్ధేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని నిర్వహి స్తోందని ప్రజలందరూ ఉపయోగిం చుకోవాలని సర్పంచ్‌లు గోవిందయ్య, శంకరమ్మలు తెలిపారు. మండలంలోని ముత్యాలపాడు 2వ సచివాల యం ఆవరణంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. సచివాలయ పరధిలోని తోడేండ్లపల్లె, చక్రవర్తుల పల్లె, ఎంతాండా గ్రామాల ప్రజలకు వైద్యాధిక ారులు పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేసారు. అనంతరం గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. ఎంపీడీవో మహ బూబ్‌ దౌలా,,హెల్త్‌ ఎడ్యుకేటర్‌ రత్నాలు, ఎంపిహెచ్‌ఓ వెంకటేశ్వర్లు,ఐసిడిఎస్‌ సూపర్‌ వైజర్‌ సుశీలమ్మ, పంచాయతి కార్యదర్శి దాసు, నీటి సంఘం అధ్యక్షుడు శేషురమేష్‌, అంకాల్‌ రెడ్డి, గిరిరాజా తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూర్‌ : మండలంలోని ముష్టి పల్లె గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంపీడీవో మోహన్‌ కుమార్‌, వైసిపి మండల అధ్యక్షుడు రాజమోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌ సూర్య కుమారి ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు ఏర్పాటు చేసిన పౌష్టిక ఆహార స్టాల్‌ ఏర్పాటు చేశారు. బండి ఆత్మకూర్‌ : మండలంలోని జి లింగా పురంలో సర్పంచ్‌ సన్మాల రాధమ్మ అధ్యక్షతన జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఐటిడిఏ పిఓ డాక్టర్‌ రవీంద్ర రెడ్డి హాజరైయ్యారు. ఈసందర్బంగా పిఒ మాట్లాడుతూ చెంచులకు మెరుగైన వైద్యం కోసం ఎంత ఖర్చైనా ఐటీడీఏ భరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వాసుదేవ్‌ గుప్తా, వైకాపా నాయకులు నరసింహారెడ్డి, శ్రీనివాసులు, కృష్ణారెడ్డి డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.