Sep 18,2023 00:11

అదనపు భవనం ప్రారంభంలో మాట్లాడుతున్న ముత్తంశెట్టి

ప్రజాశక్తి ఆనందపురం : పేదలందరికీ మెరుగైన వైద్యం అందించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆనందపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అదనపు భవనం ఏర్పాటుకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూ.50 లక్షలు వ్యయంతో నిర్మించబోయే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అదనపు భవనం (వైరస్‌ పరీక్ష ల్యాబ్‌) వల్ల మెరుగైన వైద్యం అందించడానికి దోహదపడుతుందన్నారు.
విద్య, వైద్యంలో జగన్మోహన్‌రెడ్డి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. ప్రతి మండలానికి రెండు పిహెచ్‌సిలు ఏర్పాటుచేసి, కుటుంబ డాక్టర్‌ విధానం తీసుకొచ్చి, పిహెచ్‌సిలో ఒకరు, ఫీల్డ్‌లో ఒక డాక్టర్‌ ఉండేలా విప్లవాత్మకమైన మార్పులు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్‌ఒ జగదీశ్వరరావు, ఉమావతి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు ఎం.గంగునాయుడు, షహనాజ్‌ సాదియా, ఆరోగ్య కమ్యూనిటీ అధికారి సాంబమూర్తి, సిసి నాగభూషణం, జడ్‌పిటిసి కోరాడ వెంకట్రావు, వైసిపి నాయకులు మజ్జి వెంకట్రావు, బంక్‌ సత్యనారాయణ, శ్రీను, బొట్ట రామకృష్ణ, సర్పంచ్‌ లోడగల రాజేశ్వరి, రమణ, చందక లక్ష్మి సూరిబాబు, రౌతు శ్యామల వెంకట్రావు పాల్గొన్నారు.