ప్రజాశక్తి - జీలుగుమిల్లి
ఈనెల 18న జరుగునున్న జీలుగుమిల్లి పంచాయతీ ఆరో వార్డు ఉప ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిగా కెచ్చలా రమణ బరిలో నిలిచినట్లు పార్టీ జీలుగుమిల్లి కార్యదర్శి అప్పారావు తెలిపారు. సోమవారం నామినేషన్లు విత్ డ్రా అనంతరం సిపిఎం అభ్యర్థిగా రమణను పోటీలో నిలిపినట్లు ఆయన పేర్కొన్నారు. కెచ్చల రమణ ఎన్నికల గుర్తు గౌను గుర్తును కేటాయించినట్లు తెలిపారు.










