ఆర్‌ఒఎఫ్‌ఆర్ పట్టాలు చూపుతున్న గిరిజనులు
ప్రజాశక్తి-కొయ్యూరు
మండలంలోని బూదరాళ్ళ పంచాయతీ పరిధి నల్లబెల్లి గ్రామంలో గిరిజనులకు ఆర్‌ఒఎఫ్‌ఆర్ పట్టాలను ఎంపిపి బడుగు రమేష్, జెడ్‌పిటిసి వారా నూకరాజు, వైసిపి మండల అధ్యక్షులు జల్లి బాబులు, వైస్ ఎంపిపి వెంకట రమణ మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 126 పట్టాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాగిన సంజివ్, ఎంపిటిసి వంతల కుమారి, ముసిలి నాయుడు, రాజు, తిరుపతి, రమణ, లక్ష్మణ్, లక్ష్మి పాల్గొన్నారు.










