Nov 03,2022 23:38

పట్టాలను పంపిణీ చేస్తున్న సర్పంచ్‌ ముత్యాలమ్మ

ప్రజాశక్తి -కొయ్యూరు :మండలంలోని బూదరాళ్ళ పంచాయితీ పరిధిలోని పలు గ్రామాల్లోని 126మంది గిరిజన లబ్ధిదారులకు ఆర్‌ఒఎఫ్‌ఆర్‌ పట్టాలను గురువారం పంపిణీ చేశారు. చౌడుపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్‌ సాగిన ముత్యాలమ్మ, పంచాయితీ విఆర్‌ఒ భీమన్నదొర ఆధ్వర్యంలో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజన రైతులకు సాగుహక్కుల పట్టాలు పంపిణీ చేశారు. బూదరాళ్ళ పంచాయతీలోని చౌడుపల్లిలో 42 మందికి, ముకుడుపల్లిలో 17, నల్లబెల్లిలో 42, కొర్రపాడులో 25, తదితర గ్రామాలకు చెందిన గిరిజన రైతులకు అటవీహక్కుల పట్టాలు పంపిణీ చేశారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు సంజీవ్‌, గ్రామవాలంటీర్‌, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.