ప్రజాశక్తి - పర్చూరు
మండలంలోని నాగులపాలెంలో నాగులపాలెం గంగ ఆర్‌ఒ వాటర్ ప్లాంట్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా జరిగిన సభలో రోటరీ ప్రెసిడెంట్ నాగబైరు శ్రీనివాసరావు, సపోర్ట్ అధ్యక్షులు, పోలిశెట్టి చంద్రశేఖరరావు, సెక్రెటరీ పాబొలు వెంకన్న మాట్లాడారు. పర్చూర్ రోటరీ క్లబ్‌కు సిడిజి జాస్తి రంగారావు చేసిన సేవలు కొనియాడారు. సిడిజి జాస్తి రంగారావు మాట్లాడుతూ తాను డిజిగా ఉన్న కాలంలో పర్చూరు వాటర్ ప్లాంట్‌ను స్థాపించడానికి సహకారం అందించానని చెప్పారు. నాగులపాలెం గంగ వ్యవస్థాపక దాతలు ముద్దన హరిబాబు తన పూర్తి సహాయ, సహకారం అందిస్తానని తెలిపారు. సభలో మాజీ జెడ్పీటీసీ కొల్లా సుభాష్ బాబు, నాగులపాలెం సర్పంచ్ డి సుధారాణి, వైస్ సర్పంచ్ ఎ రామకృష్ణను ఘనంగా సన్మానించినారు. ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్స్ భవనం రాజగోపాల్‌రెడ్డి, తేళ్ళ రమేష్ చంద్ర బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో రోటరీ సభ్యులు కెఎస్‌ఆర్‌కె ప్రసాద్, పి ఉదయ భాస్కర్, కె ఆంజనేయులు, కె అశోక్ కుమార్, తోకల కృష్ణమోహన్, కె కొండల రాయుడు, డి సత్యనారాయణ, కె సత్యనారాయణ, ఎజిజికె రెడ్డి, ఎంపీటీసీ మెంబర్, నాగులపాలెం ఆర్‌సిసి సభ్యులు చాగంటి నాగేశ్వరరావు, ఎ సతీష్ బాబు, ఎ కుప్పస్వామి, కొల్లా శివరామకృష్ణ పాల్గొన్నారు.










