Nov 11,2023 00:02

ఆర్‌ఒప్లాంట్‌ను ప్రారంభిస్తున్న సర్పంచి పెద్దమస్తాన్‌

ప్రజాశక్తి - తర్లుపాడు : మండల పరిధిలోని కేతగుడిపి ఎస్‌సి కాలనీలో ఎఫర్ట్‌ సంస్థ ఆధ్వర్యంలో ఆర్‌ఒ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. ఆర్‌ఒ ప్లాంట్‌ను ఎఫర్ట్‌ సంస్థ పౌండర్‌ జెవి. మోహన్‌ రావు, గ్రామ సర్పంచి దూదేకుల పెద్ద మస్తాన్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ గ్రామస్తుల దాహర్తీ తీర్చేందుకు ఆర్‌ఒ ప్లాంట్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పిన్నిక గోపి,సచివాలయం సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.