అరణియార్ ప్రాజెక్టులో 'ఆయుధపూజ'
అరణియార్ ప్రాజెక్టులో 'ఆయుధపూజ'
ప్రజాశక్తి - పిచ్చాటూరు
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలో ప్రకతి అందాలతో విరాజిల్లుతున్న అరణియార్ ప్రాజెక్టులో జైకా నిధులతో జరుగుతున్న పనులకు ప్రజలు సహకరించాలని ఎంఎల్‌ఎ ఆదిమూలం కోరారు. అరణియార్ గేట్లకు గురువారం ఆయుధపూజ నిర్వహించారు. తుడా నిధులతో రూపురేఖలు మారుతున్నట్లు తెలిపారు. వ్యూటవర్, చిల్ట్రన్స్ పార్క్, ఉద్యానవనం మొదలైన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. తద్వారా అరణియార్ ప్రాజెక్టు పర్యాటక కేంద్రంగా మారనుంది ఈ కార్యక్రమంలో ఈఈ మదన్ గోపాల్ రాజు, డిఇ రత్నాకర్ రెడ్డి, తాసిల్దార్ మధుసూదన్ రావు ,ఎంపీడీవో శ్రీనివాసులు, ఏరు లోకేష్, ఎస్సై వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కే చలపతి రాజు పాల్గొన్నారు.










