Mar 15,2023 23:55

కురుస్తున్న వర్షం

ప్రజాశక్తి-అరకులోయ:పర్యాటక కేంద్రమైన అరకులోయలో బుధవారం సాయంత్రం తొలకరి వాన కురిసింది.తీవ్రమైన ఎండ వేడితో ఉక్కిరి బిక్కిరైన మన్యం వాసులకు ఈ తొలకరి వర్షం ఉపశమనం కలిగించింది. తొలకరి వాన కురవడంతో ఈ ప్రాంత వాసులు అందరూ ఆస్వాదించారు. సుమారుగా గంటపాటు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురిసింది. దుక్కి ప్రారంభించడానికి తొలకరి వర్షం ఉపయోగపడుతుందని కొంత మంది గిరిజనులు అభిప్రాయం వ్యక్తం చేశారు.కుండపోత వర్షం కురవడంతో అరకులోయ ప్రాంతంలో కొంత చల్లటి వాతావరణం నెలకొంది. బుధవారం రాత్రి విద్యుత్‌ కి అంతరాయం కలిగింది.