Jun 13,2023 23:23

బుచ్చయ్య పేట మండలం, సీతయ్యపేట జెడ్‌పి హైస్కూల్‌లో బ్యాగులు లేకుండానే పుస్తకాలు పంపిణీ చేసిన దృశ్యం

బ్యాగులు లేకుండానే పంపిణీ
ప్రజాశక్తి - బుచ్చయ్య పేట

ప్రభుత్వం విద్యార్థులకు అట్టహాసంగా పంపిణీ చేస్తున్న జగనన్న విద్యా కానుక కిట్లు అరకొరగానే పంపిణీ జరుగుతుంది. పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు సరఫరా కాలేదు. విద్యా కానుక కిట్‌లో ఉండాల్సిన బ్యాగులు మండలంలో ఒక్క విద్యార్థి కూడా పంపిణీ చేయలేదు. మండలంలో ఉన్న మండల పరిషత్తు ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో 5385 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్‌, బూట్లు, డిక్షనరీలు తదితర వాటిని అరకొరగా పంపిణీ చేస్తున్నారు. 58వేల పాఠ్యపుస్తకాలకు గాను, 48 వేలు మాత్రమే మండల విద్యాశాఖ కార్యాలయానికి వచ్చాయి. వీటిని గత రెండు రోజులుగా మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. 5385 మంది విద్యార్థులకు గాను ప్రభుత్వం బ్యాగులను సరఫరా చేయలేదు. రెండు రోజుల క్రితం బాలికలకు యూనిఫామ్‌, సోమవారం విద్యార్థులకు యూనిఫామ్‌ ప్రభుత్వం పంపిణీ చేసింది. విద్యార్థులకు కావలసిన అన్ని విద్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినా పూర్తిస్థాయిలో పంపిణీ జరగలేదు. అరకొరగా పంపిణీపై విద్యార్థుల తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు.