Dec 05,2022 23:54

ధర్నా చేస్తున్న సిపిఐ నాయకులు

ప్రజాశక్తి -కొత్తకోట
జగనన్న కాలనీ లబ్ధిదారులకు రెండు సెంట్లు స్థలం కేటాయించి, గహ నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలనీ డిమాండ్‌ చేసూ ్తరావికమతం మండల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సోమవారం సీపీఐ, ఏపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శివలంక కొండలరావు, సిపిఐ మండల కార్యదర్శి జి.జోగిరాజు తదితరులు మాట్లాడుతూ జగనన్న కాలనీ పేరుతో కేవలం ఒక్కో సెంటు స్థలం ఇచ్చి నిర్మాణానికి రూ.1.80 లక్షలు ఇస్తే నిరుపేదలు ఇళ్ల నిర్మాణాన్ని ఎలా పూర్తిచేసుకోగలరని ప్రశ్నించారు. అనంతరం మండల తహసీల్దార్‌ కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌ అప్పారావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ కార్యకర్త మాలిచేట్ల పరశురామ్‌ పలువురు ఇళ్ల లబ్ధిదా రులు పాల్గొన్నారు.
గొలుగొండ : గొలుగొండలో సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం తహశీల్దార్‌ ఆనంద్‌కు వినతిపత్రం అందజేశరు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు మాట్లాడుతూ స్థలం, పక్కా గృహం నిర్మించి పేదలకు అందజేస్తామని హామీనిచ్చిన వైసిపి ప్రభుత్వం, సెంటు జాగా ఇచ్చి, ఇంటి నిర్మాణానికి 1.80లక్షలు మాత్రమే ఆర్థికసాయం ఇస్తామని చెప్పి చేతులు దులుపుకుంటోందని, ఇలాగైతే పేదల సొంతింటి కల ఎలా సాకారమౌతుందన్నారు.. జగనన్న కాలనీలో తాగునీరు,విద్యుత్‌ రోడ్లు సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం కార్యదర్శి మేకా సత్యనారాయణ, సిపిఐ మండల కార్యదర్శి మేకా భాస్కరరావు, నల్లబెల్లి శ్రీరామ్మూర్తి, కార్యవర్గ సభ్యులు ఎం.సత్యనారాయణ, బాబులు, ఎల్‌.సత్యనారాయణ, పి.ప్రసాద్‌, జి.సత్యనారాయణ పాల్గొన్నారు.
దేవరాపల్లి : జగనన్న ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఇవ్వాలని సిపిఐ నాయకుఏలు వేమల కన్నబాబు డిమాండ్‌ చేశార. సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం మండల తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్‌ డి.అరుణ్‌ చంద్రకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాము, దేవుడిబాబు, అమ్మతల్లి పాల్గొన్నారు
టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించాలని...
అనకాపల్లి : టిడిపి ప్రభుత్వ హయాంలో ఎంపిక చేసిన పట్టణ పేదలకు కేటాయించిన టిడ్కో గృహాలను తక్షణమే లబ్ధిదారులకు అప్పగించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో ప్రదర్శన నిర్వహించి, జీవీఎంసీ జోనల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ లబ్ధిదారులను జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వైఎన్‌ భద్రం, చెల్లూరి నాగరాజు, రాజాన దొరబాబు, తాకాసి వెంకటేశ్వరరావు, శ్రీరామదాసు అబ్బులు, కోరిబిల్లి శంకర్రావు, బోయిన గోవింద, రామచంద్రరావు పాల్గొన్నారు.