ప్రజాశక్తి -చిత్తూరు అర్బన్
: స్థానిక రుక్మిణి కష్ణ స్వామి జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాలలో 17వ ఫ్రెషర్స్‌డేను ఘనంగా నిర్వహించారు. మండపంలో నిర్వహించిన కళాశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కరస్పాండెంట్ డీకే బద్రీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అందించేందుకు తమ విద్యా సంస్థ ఆర్కే జూనియర్ కళాశాల కషి చేస్తుందన్నారు. క్రమశిక్షణతో విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా కష్టపడి చదవాలని కోరారు.
సీతమ్స్ ప్రిన్సిపాల్ వెంకటాచలపతి మాట్లాడుతూ శక్తిసామర్థ్యాలు ఉన్న విద్యార్థులు కాలానికి అనుగుణంగా కష్టపడి చదవాలని కోరారు. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ బాబు మాట్లాడుతూ ఆర్కే విద్యాసంస్థలు సేవా దక్పథంతో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయన్నారు 2023 ఇంటర్ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో తమ జూనియర్ కళాశాల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు డిఎల్‌ఎస్‌ఎ కార్యదర్శి కర్ణ కుమార్ చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి.










