అర్జీలు స్వీకరిస్తున్న దృశ్యం
అర్జీలు పునరావృతం కాకుండా పరిష్కారం
ప్రజాశక్తి-నెల్లూరు :జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ప్రజల నుంచి అందే అర్జీలు మళ్లీ మళ్లీ పునరావతం కాకుండా సంతప్తికరస్థాయిలో సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఆర్. కూర్మనాథ్, అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జాయింట్ కలెక్టర్ ఆర్. కూర్మనాథ్, డిఆర్‌ఓ శ్రీమతి వెంకట నారాయణమ్మ, జడ్పి సీఈఓ చిరంజీవితో కలిసి జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖల జిల్లా అధికారులు జగనన్న కు చెబుదాం కార్యక్రమంలో వచ్చే అర్జీలపై ప్రత్యేక దష్టి సారించాలని, ఒకసారి వచ్చిన అర్జీ మళ్లీ మళ్లీ రాకుండా సమస్యను పరిష్కరించేలా సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో పరిష్కరించిన అర్జీలు మరలా వస్తున్నాయని అలా మరల వస్తున్న పరిష్కరించిన అర్జీలపై ప్రత్యేక దష్టి సారించి సంబంధిత అర్జీదారులను పిలిపించి పరిష్కారం చేయగలిగినవి చేయాలని లేని పక్షంలో ఎందువలన పరిష్కారం చేయలేకపోతున్నామో స్పష్టంగా వివరించాలన్నారు.ఈ కార్యక్రమంలో మెప్మా, ఐసీడీఎస్ పిడీలు రవీంద్ర, హేన సుజన, ఐటీడీఏ పిఓ మందా రాణి,సమగ్ర శిక్ష ఎపిసి ఉషారాణి, సోషల్ వెల్ఫేర్ డిడి రమేష్, జిల్లా బిసి వెల్ఫేర్ అధికారి వెంకటయ్య, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఎడి హనుమాన్ ప్రసాద్, డిటిడబ్ల్యూఓ పరిమళ, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు










