ప్రజాశక్తి-కాకినాడ జగనన్నకు చెబుదాం కార్యక్రమం కింద అందిన అర్జీలకు నాణ్యమైన, సంతప్తికర పరిష్కారం అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం అమరావతి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్.జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, జెసిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకం, ప్రాధాన్యత భవనాల నిర్మాణాలు తదితర అంశాల్లో ఇప్పటి వరకు సాధించిన పురోగతిని ఈ సందర్భంగా సిఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టరు ఎస్.ఇలక్కియ, వివిధ జిల్లా స్థాయి అధికారులతో కలిసి హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమం కింద వచ్చిన వినతులకు అత్యంత నాణ్యతతో కూడిన పరిష్కారాలను అందించేలా చర్యలు చేపట్టాలని కలెక్టరు తెలిపారు. ప్రాధాన్యత భవన నిర్మాణాలలో జాప్యం లేకుండా పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకొని పనులలో పురోగతి సాధించాలన్నారు. రెండో దశలో జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ద్వారా చేపట్టిన రీ సర్వే పనులు నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలు లక్ష్యాల సాధనకు అధికారులు ప్రణాళికాబద్ధంగా కషి చేయాలని కలెక్టరు కతికా శుక్లా తెలిపారు. ఈ సమావేశంలో జెడ్‌పి సిఇఒ ఎ.రమణా రెడ్డి, సిపిఒ పి.త్రినాథ్, డిఎం అండ్ హెచ్‌ఒ డాక్టర్ ఆర్.రమేష్, పిఆర్ ఎస్‌ఇ ఎం.శ్రీనివాసు, సర్వే ఎడి బి.లకీëనారాయణ, ఎపిఇపిడిసిఎల్ ఇఇ ప్రసాద్, డ్వామా పీడీ ఎ.వెంకట లక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్‌ఇ ఎం.శ్రీనివాసు కాకినాడ, పెద్దాపురం డిఎల్‌డిఒ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.










