Apr 10,2023 22:52

ప్రజాశక్తి-విజయవాడ: ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ ఫుండ్కర్‌ ఆదేశించారు. విఎంసిలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. నగరంలోని ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 20 అర్జీలను మేయర్‌, కమిషనర్‌ స్వీకరించారు. అర్జీలు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని వారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నగర పరిధిలోని ఆయా సర్కిల్‌ కార్యాలయాలలో జోనల్‌ కమిషనర్లు స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్కిల్‌-2 కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక విభాగంనకు సంబంధించి ఒక అర్జీ దాఖలైంది.