
ప్రజాశక్తి-అమలాపురం
అర్జీదారుల సమస్యల పట్ల సాను కూలంగా స్పందించి నిబంధ నలకు అనుగుణంగా తగు పరిష్కా ర మార్గాలు సకాలంలో చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్.సత్తిబాబు జిల్లా స్థాయి అధికా రులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి భవన్ స్పందన హాలు నందు సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం స్పందన కార్య క్రమంలో సుమారు 206 మంది అర్జీ దారులు జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్‌ఒ సత్తిబాబుకు అర్జీలు అందించారు. వీటిలో ప్రధానంగా రెవెన్యూ, భూ సమ స్యలు సామాజిక భద్రత పింఛన్లు వివిధ సంక్షేమ పథకాలు మంజూరు పౌరసరఫరాలు తదితర సమస్య లపై అందాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాస్థాయి అధికారులు తమ లాగిన్ కు వచ్చిన సమస్యలను సకాలంలో విచారించి యాప్ లో నమోదు చేస్తూ నిర్దేశిత గడువులోగా పరిష్కార మార్గాలకు చూపుతూ జగనన్నకు చెబుదాం అర్జీల పరిష్కార సరళి పట్ల అర్జీ దారులలో నమ్మకాన్ని పెంపొం దించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పథక సంచాల కులు వి.శివశంకర్ ప్రసాద్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ ఎస్.మధుసూదన్, డిపిఒ వి.కష్ణ కుమారి, ఎల్డిఎం కె.శ్యాంబాబు, డిఎస్‌ఒ ఎ పాపారావు, ఎడి సర్వే కె.ప్రభాకర్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి ఎ.బోసు బాబు తదితరులు పాల్గొన్నారు.