ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రజల నుంచి వస్తున్న అర్జీలకు సత్వర పరిష్కారం చూపా లని, ఎప్పటికప్పుడు వాటి వివరా లను ఆన్‌లైన్‌లో నమోదు చేయా లని కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత ఆదేశించారు. సోమవారం కలెక్టరే ట్‌లో ప్రజల నుంచి ఎస్‌పి పి. జగదీష్, జెసి తేజ్ భరత్‌లతో కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం పరిపాలనపరమైన, పోలీస్ శాఖకు చెందిన 192 అర్జీలు వచ్చాయన్నారు. జిల్లాలో రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖలకు చెందిన 6 అర్జీలు ఎస్‌ఎల్‌ఎ కాలపరిమి తిలోగా పరిష్కా రం చూపలేదని పేర్కొన్నారు. పరిపాలన సంబంధ మైన 152 అర్జీలలో రెవెన్యూ, పంచాయతీ రాజ్, తదితర శాఖలకు చెందిన అంశాలపై అర్జీలు వచ్చాయన్నారు. ఎస్‌పి మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం కఠినమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. మాదక ద్రవ్యాలు, మద్యం, తదితర అసాం ఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అటువంటి వారిపై, వారిని ప్రోత్సహించే వారిపై పిడి కేసులను నమోదు చేస్తామని అన్నారు. పోలీసు శాఖ పరిధికి చెందిన 40 అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లా డుతూ రీ ఓపెన్ అయిన అర్జీలను పరిష్కారం చేస్తున్నా తిరిగి వస్తుం డడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఒ జి. నరసింహులు, అదన పు ఎస్‌పి ఆర్ రాజశేఖర రాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, టూరిజం అర్‌డి వి.స్వామినాయుడు, కెఆర్‌ఆర్‌సిఎస్ డిటి.కృష్ణనాయక్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.