Jul 31,2023 21:23

అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

ప్రజాశక్తి-బెలగాం : ప్రజల నుంచి జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి వచ్చిన అర్జీలను సత్వరమే క్షేత్ర స్థాయిలో విచారించి, పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు, ఐటిడిఎ పిఒ సి.విష్ణుచరణ్‌తో కలిసి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. అర్జీలను పరిశీలించిన కలెక్టర్‌.. సంబంధిత అధికారులకు పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ పి.కిరణ్‌ కుమార్‌, డిఎంహెచ్‌ఒ జగన్నాథరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాబర్ట్‌ పాల్‌, ఆర్‌.డబ్ల్యు.ఎస్‌. ఇంజినీరింగ్‌ అధికారి ప్రభాకర రావు, డిపిఒ బి.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.