
పుట్టపర్తి అర్బన్ : స్పందన ద్వారా సమర్పించే అర్జీలకు సత్వర పరిష్కారాన్ని అందించాలని కలెక్టర్ పి.అరుణ్ బాబు వివిధ శాఖల ధికారులను ఆదేశించారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్‌లోని స్పందన సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి 76 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్నంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్‌ఎల్‌ఎ, రీఓపెనింగ్, లేకుండా అర్జీదారుడు సంతప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. బియాండ్ ఎస్‌ఎల్‌ఎ 12 ఉన్నాయని వాటిని త్వరితగతిని పరిష్కరించాలని ఆదేశించారు. ఇంటింటి ఓటర్ల సర్వే కార్యక్రమం క్లైంలను క్షుణ్నంగా పరిశీలించి కార్యక్రమం రెండు రోజుల లోపలపూర్తి చేయాలని ఆదేశించారు. ఇంటింటి ఓటర్ సర్వే క్లైంల పరిష్కారం, రీ సర్వే, జగనన్న ఆరోగ్య సురక్ష పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి క్షేత్రస్థాయిలో అమలుపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఒకే ఇంట్లో పదిమంది ఓటర్లు ఉన్న ఇల్లుపై ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు. వీటిపై నియోజకవర్గ సహాయ ఎన్నికల అధికారులు, ఎన్నికల డిప్యూటీ తహల్దారులు, పర్యవేక్షణ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ టిఎస్.చేతన్, డిఆర్‌ఒ కొండయ్య, పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖ, గ్రామ వార్డు సచివాలయాల నోడల్ అధికారి శివారెడ్డి, సిపిఒ విజరు కుమార్, హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డి, పీఆర్ ఎస్‌ఈ గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డీఆర్డీఏ పీడీ నరసయ్య, డిఎంహెచ్‌ఒ డా||కష్ణారెడ్డి వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నిరంతరంగా 'జగనన్నకు చెబుదాం'
జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈనెల 13వ తేదీన నల్లమడ, 15న ఓబుల చెరువు, 20న గోరంట్ల, 22న కొత్తచెరువు, 27 న బుక్కపట్నం, 29న పుట్టపర్తి ఎంపిడిఒ కార్యాలయాల్లో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లా, మండల స్థాయి అధికారులు వారి శాఖలకు చెందిన నివేదికలతో హాజరుకావాలని సూచించారు.