Sep 11,2023 21:31

అర్జీలు సమర్పిస్తున్న దృశ్యం

అర్జీలు సమర్పిస్తున్న దృశ్యం
అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా పరిష్కారం
ప్రజాశక్తి-నెల్లూరు :జగనన్నకు చెబుతాం( స్పందన) కార్యక్రమంలో ప్రజల నుండి అందిన సమస్యలపై సంభందిత అధికారులందరూ ప్రత్యేక దష్టి సారించి అర్జీదారుడు సంతప్తి చెందే విధంగా సమస్యలు పరిష్కరించాలని, అర్జీలు మరలా పునరావతం కాకుండా పరిష్కార మార్గం చూపాలని కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌ అధికారులను ఆదేశించారు. అర్జీ దారుల సమస్యలను సావధానంగా వింటూ వచ్చిన అర్జీలను సంభందిత అధికారులకు ఎండార్స్‌ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, మండల, డివిజన్‌ లకు సంబందించినవైతే సంభందిత అధికారులకు ఫోన్‌ చేసి పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు.స్థానిక కలెక్టరేట్‌ లోని తిక్కన ప్రాంగణం లోజరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలోసోమవారం ప్రజల నుండి అర్జీలను కలెక్టర్‌ ఎం హరి నారాయణన్‌, జాయింట్‌ కలెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ ,డిఆర్‌ఒ వెంకట నారాయణమ్మ, డిఆర్‌డిఎ పిడి సాంబశివా రెడ్డి స్వీకరించారు.ఈ సంధర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీలు పునరావతం కాకుండా సకాలంలో సరైన పరిష్కారం చూపించాలన్నారు.
జగనన్నకు చెబుదాం లో వచ్చే అర్జీ లను చదివి అర్థం చేసుకుని అర్జీ దారుడు సంతప్తి చెందే విధంగా పరిష్కారం చూపించాలని అన్నారు. ప్రజా సమస్యలు శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం జగనన్నకు చెబుదాం కార్య క్రమం అమలు చేస్తున్నదన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్‌ఫి సిఈఒ చిరంజీవి,డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్‌ ఎం. పెంచలయ్య, పిడి హౌసింగ్‌ నాగరాజు,పిడి మెప్మా రవీంద్ర, డిఈఒ గంగాభవాని, ఇరిగేష్‌ శాఖ ఎస్‌ఈ కష్ణ మోహన్‌, సంక్షేమ అధికారులు రమేశ్‌,వెంకటయ్య, పరిమళ, జిల్లా రిజస్ట్రార్‌ , సర్వే , ఏడి, ఐసిడిఎస్‌ పిడి, డిఎస్‌ఒ, డిసిహెచ్‌ఎస్‌ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.