Apr 27,2023 21:18

మిరపను పరిశీలిస్తున్న ఎఒ

ప్రజాశక్తి - పెద్దకడబూరు
బాగా ఆరిన పంటను ఇంటికి తెచ్చుకోవాలని ఎఒ వరప్రసాద్‌ తెలిపారు. గురువారం మండలంలోని గ్రామ శివారులోని కల్లాల్లో ఆరబెట్టిన ఎండు మిరపను ఎఒ వరప్రసాద్‌, పెద్దకడబూరు గ్రామ వ్యవసాయ సహాయకులు ఎం.శ్వేత, రైతులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎఒ మాట్లాడారు. ఇంకా వారం రోజుల వరకు వాతావరణం మేఘావృతమై ఉంటుందని తెలిపారు. బాగా ఆరిన పంటను ఇంటి వద్దకు తెచ్చుకోవాలని సూచించారు. సరిగ్గా ఆరని పంటలు ఉంటే టార్ఫాన్లు సిద్ధంగా ఉంచుకొని పంటలు కాపాడుకోవాలని తెలిపారు. వరి ధాన్యం ఎక్కడైనా తడిసినట్లయితే మొలకలు రాకుండా అవసరమైతే లీటర్‌ నీటికి 5 గ్రాములు కలిపిన ఉప్పు ద్రవణం చల్లుకోవాలని సూచించారు.