పుట్టపర్తి అర్బన్ : ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా అందిస్తున్న లబ్ధిని అర్హులందరికీ అందిస్తున్నట్లు కలెక్టర్ అరున్‌బాబు పేర్కొన్నారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి ద్వైపాక్షిక నగదు బదిలీ కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, ఎంపీ గోరంట్ల మాధవ్, సహకార బ్యాంకు ఛైర్మన్ లిఖిత, డిఆర్‌ఒ కొండయ్య, పుడా ఛైర్‌పర్సన్ లక్ష్మీనరమ్మ, జిల్లా అగ్రి బోర్డ్ ఛైర్మన్ ఆవుటాల రమణారెడ్డి, ఒక్కలిక కార్పొరేషన్ ఛైర్మన్ డాక్టర్ నళిని, ఎంపిపి రమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక నగదు బదిలీ చెక్కును అధికారులు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఏడీ రమేష్, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, నోడల్ అధికారి శివారెడ్డి, గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు వాలంటీర్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అన్ని జిల్లా కలెక్టర్లతో గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినారు. పుట్టపర్తి నుంచి కలెక్టర్ అరుణ్‌బాబు, వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మాత , శిశు మరణాలు సంభవించ కూడదన్నారు. బయట ఉన్న విద్యార్థులను వంద శాతం పాఠశాల, కళాశాలకు చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి ఈనెల 30వ తేదీన అన్ని జిల్లాల జగనన్న కాలనీలను ప్రారంభించనున్నారని చెప్పారు. ఆయా కాలనీల్లో ప్రతి లేఅవుట్‌కు స్వాగత ద్వారం(వెల్కమ్ ఆర్చ్) ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ నిర్దేశిత మార్గ సూత్రాలకు అనుగుణంగా స్వాగత ద్వారాలు నిర్మించాలని ఆదేశించినారు. ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ జిల్లాలో బడి బయట ఉన్న విద్యార్థులను వెంటనే తిరిగి పాఠశాలలు, కళాశాలల్లో చెర్పించేలా చర్యలు చేపట్టమన్నారు. ఈ సమావేశంలో సిపిఒ విజరు కుమార్, డిఎంఅండ్‌హెచ్‌ఒ, ఎస్వీ కృష్ణారెడ్డి, డిసిహెచ్‌ఒ తిపేంద్ర నాయక్, ఎస్‌ఈ పిఆర్ గోపాల్ రెడ్డి, హౌసింగ్ పీడీ చంద్రమౌళి రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










