మాట్లాడుతున్న కమిషనర్
అర్హులందరినీ ఓటర్లుగా గుర్తించాలి
- కమిషనర్ వికాస్ మర్మత్, ఐ.ఏ.యస్
ప్రజాశక్తి-నెల్లూరు:నగర పాలక సంస్థ పరిధిలో జనాభాకు తగ్గట్టుగా యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని ఎన్నికల అధికారులకు కమిషనర్ వికాస్ మర్మత్ సూచించారు. ఎన్నికల అధికారులు, సూపర్ వైజర్లు, బూత్ లెవెల్ అధికారులతో కార్యాలయంలోని ఏ.పి.జె అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో రెండు సెషన్లలో సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఓటర్ల జాబితా రూపొందించడంలో బి.ఎల్.ఓ లు తమకు కేటాయించిన పరిధిలో డోర్ టు డోర్ సర్వేను ఖ చ్చితంగా నిర్వహించి , ఒక డోర్ నెంబరుపై ఎక్కువమంది ఓటర్లు నమోదు అయిఉంటే పూర్తి స్థాయిలో విచారించి పై వివరాలను సంబధిత ఫార్మ్స్ ద్వారా ఆఫీస్ కు సమర్పించ వలసిందిగా, సరియైన వివరాలను మాత్రమే నమోదు చేయాలన్నారు. నగర పాలక సంస్థ పరిధిలోని ఓటర్లు - జనాభా నిష్పత్తి, లింగ నిష్పత్తి, కొత్త ఓటర్ల నమోదు, వివిధ క్లయిముల పరిష్కరించే విధముగా దష్టి సారించాలని ఆదేశించారు. ఓటర్లు - జనాభా నిష్పత్తిలో ఉన్న తేడాను తగ్గించేందుకు, గడప గడపకు తిరిగే కార్యక్రమం ద్వారా ఓటర్ల నమోదుకు ప్రజలను చైతన్యపరిచి, ఫారం 6 ద్వారా 18 సంవత్సరాలు దాటిన అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని మరేదైనా ప్రాంతంలో వారి ఓటు నమోదు ఉందా అని సరి పోల్చుకోవాలని, రాబోయే 3 నెలల కాలంలో 18 సంవత్సరాలు నిండి మేజర్లు కాబోయే వారి వివరాలను సేకరించి, జాబితాలో నమోదు చేయాలని కమిషనర్ సూచించారు.సమీక్షా సమావేశానికి హాజరు కాని బి.ఎల్.ఓ లకు షో కాజ్ నోటీసులు జారీ చేసి 3 రోజుల్లో వివరణ తీసుకోవాలని ఆదేశించారు. ఇంటింటి సర్వేలో కొంతమంది బి.ఎల్.ఓ లు ఉత్తమ ప్రతిభ కనబరిచి ఓటర్ల నమోదును వేగవంతం చేశారని, అలాంటి వారిని ఇతరుల సిబ్బంది ఆదర్శంగా తీసుకోవాలని కొరారు. నగర పాలక సంస్థ పరిధిలోని 6, 7, 8 క్లైయిమ్ ఫారాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సూచించిన గడువులోగా పరిష్కరించాలన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా వివరాలను సేకరించి 80 సంవత్సరాలు దాటిన వయోవద్ధులు, దివ్యాంగులు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు చర్యలు చేపట్టాలని, కార్యాలయానికి పంపించే తొలగింపు జాబితాలో సరియైన రిమార్క్స్ తో పాటు తప్పనిసరిగా సాక్షి సంతకాన్ని కూడా జతపరచాలని సూచించారు. మాన్యువల్ గా సమర్పించే క్లయిములకు తగిన రసీదులను తప్పనిసరిగా ఓటర్లకు అందజేయాలన్నారు. ఓటర్ల చేర్పులు, తొలగింపులకు రాజకీయ పార్టీల బి.ఎల్.ఎల్ లను సమన్వయం చేసుకుని జాబితాలో ఎలాంటి తప్పిదాలు లేకుండా సరిచూసుకోవాలని కమిషనర్ సూచించారు. ప్రతీ పోలింగ్ బూత్ లో మౌలిక సదుపాయాలను కల్పించి, ఓటర్లకు అవసరమైన అన్ని వసతులను కల్పించాలన్నారు. ప్రతీ పోలింగ్ బూత్ లో 1300 మంది లోపు ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, అదనపు ఓటర్లను సమీప పోలింగ్ స్టేషన్ కు బదిలీ చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏ.ఈ.ఆర్.ఓలు నిర్మలానంద బాబా, దేవీ కుమారి, దశయ్య, ధనుంజయులు రెడ్డి, శ్రీనివాసులు, ఈ.డి.టి, సూపర్ వైజర్లు, బూత్ లెవెల్ అధికారులు, ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.










