Jul 06,2023 21:48

ప్రజాశక్తి-విజయవాడ: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు అయ్యేందుకు వాటి కోసం అవసరమైన వివిధ రకాల సర్టిఫికెట్స్‌ను సత్వరమే ఇచ్చేందుకు సచివాలయ ఉద్యోగులు పని చేయాలని డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ కోరారు. స్థానిక 15వ డివిజన్‌ రామలింగేశ్వర నగర్‌లో 71, 72 సచివాలయాలపైన ఉన్న ఆఫీసులో జగనన్న సురక్ష శిక్షణా కార్యక్రమం గురువారం జరిగింది. 68, 69, 70, 71, 72 సచివాలయా వాలంటీర్లు, కన్వీనర్లు, గహ సారథులతో నిర్వహించిన ఈ సమావేశానుద్దేశించి బెల్లందుర్గ మాట్లాడుతూ ఈ నెల 14 నుండి 21తారీకు కల్లా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూర్చడానికి అవసరమైన సర్టిఫికెట్స్‌ను మంజూరుకు సచివాలయ సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్‌ ఆళ్ల చల్లారావు, డివిజన్‌ ప్రెసిడెంట్‌ వెంకటరెడ్డి పాల్గొన్నారు.